Translate

Friday, 17 July 2015


సుశ్రుతుడు 




ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడు. భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీ.పూ.8 వ శతాబ్దానికి చెందినవారు. మన పురాణాలలో "చరకులు" అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడినది. చరకుడు తన శిష్యవైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సంవత్సారాల తరువతా రొగులకి వైద్యం అవసరం కొసం క్షవరం అవసరమైనది, ఆ తరువాత కాలములొ కొంతమంది "చరకులు" కాస్తా "క్షురకులు" గా మార్పు చెందేరు.
చరకుడు గొప్ప ఆయుర్వేద శిఖామణి. సుశ్రుతుడి లాగానే చరకుడు కూడా "చరక సంహిత" అనే గొప్ప ఆయుర్వేద సమగ్ర విజ్ఞాన గ్రంథం రచించాడు. చరకుని ఆయుర్వేద పరిజ్ఞానం మహోత్కృష్టమైనది. చరక సంహిత వెలువడిన కొన్ని శాతాబ్దాల తరువాత కూడా అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు చరక సంహితను మళ్ళీ మళ్ళీ తిరిగి రచించి ఎన్నో వ్యాఖ్యానాలు రాశాడు. వాళ్ళలో కాశ్మీకరుడు, ధృవబాల మొదలైన వాళ్ళు ముఖ్యులు. "చరకసంహిత" క్రీ.శ.987 లో అరబ్, పర్షియన్ భాషల్లోకి అనువదింపబడినది.
శరీరానికి కలిగే వ్యాధులు ముఖ్యంగా వాత,పిత్త,శ్లేష్మ దోషాల వల్లే కలుగుతాయని సిద్ధాంతీకరించాడు చరకుడు. ఆయుర్వేద వైద్యుల చిట్టాలో ముఖ్య ఔషధాలలో ఒకటైన ఉసిరి కాయ, తానికాయ, కరక్కాయ లతో తయారైన త్రిఫల చూర్ణం చరకుడు ప్రసాదించినదే! అలాగే వ్యాధికి జరిపే చికిత్స కంటే ముందు వ్యాధి కారణాలను కనుగొనడం ముఖ్యమని ప్రతిపాదించాడు చరకుడు. క్యాన్సర్ కణాలకు, పక్షవాతం , మూర్చ , కుష్టువ్యాధి, చూపు మందగించటం లేదా పూర్తిగా పోవడం వంటి వ్యాధులకు అతి సులభమైన నివారణోపాయాలను చరకుడు తన చరక సంహితలో పొందుపరిచాడు.
మనిషి రోగాన్ని తగ్గించే శక్తి పాదరసానికి ఉందని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎన్నో మొండి రోగాలకు పాదరసాన్ని పుటం పెట్టి చరకుడు వైద్య ప్రయోగం చేసి రోగం నయం చేసిన తీరు పెద్ద పెద్ద వైద్య ప్రముఖుల్ని సైతం విస్మయానికి గురి చెసింది. మానసిక, శారీరక, ఆరోగ్యాలు రెండూ సరిగా ఉండటమే నిజమైన సంపూర్ణ ఆరోగ్యస్థితి అని ఆయుర్వేద వైద్య శాస్త్రం ఎన్నడో పేర్కొంది. భౌతిక పదార్థాలైన వృక్ష,జంతు, ఖనిజ,రసాయన సంబంధమైన ఔషధాలు శారీరక రుగ్మతల్ని తగ్గిస్తే కొన్ని రకాలైన మంత్రోచ్ఛాటన ఒక క్రమ పద్ధతిలో చేయటం వల్ల మానసిక రుగ్మతలు ఉపశమిస్తాయని చరకుడు ప్రతిపాదించాదు. ఇప్పుడు ఆధునిక వైద్యులు చేస్తున్న "ఆల్టాసోనిక్" వైద్య చికిత్సా విధానానికి చరుని సిద్ధాంతమే ప్రేరన.
చరక సంహిత క్రీ.శ.3-2 శాతాబ్దాల మధ్య కాలంలో రచించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఈ చరక సంహిత "అష్టాంగ స్థానములు" గా రచించబడినది. దీని మొత్తం 120 అధ్యాయాలున్నాయి.
1. సూత్రస్థానం : 30 అధ్యాయములు
2.నిదానస్థానం : 8 అధ్యాయములు
3.విమానస్థానం : 8 అధ్యాయములు
4.శరీరస్థానం : 8 అధ్యాయములు
5.ఇంద్రియస్థానం : 12 అధ్యాయములు
6.చికిత్సస్థానం : 30 అధ్యాయములు
7.కల్పస్థానం : 12 అధ్యాయములు
8.సిద్ధిస్థానం : 12 అధ్యాయములు
దీనిలో చికిత్స స్థానంలో 17 అధ్యాయాలు, కల్పస్థానం, సిద్ధిస్థానాలు పూర్తిగా క్రీ.శ. వ శతాబ్దానికి చెందిన ధృవబాల అనే ఆయుర్వేద శాస్త్రవేత్త రచించి కలిపినట్లుగా చరిత్రకారుల అభిప్రాయం.
మనిషి ఎప్పుడూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, శారీరక మానసిక దృడత్వాన్ని కలిగి ఉండాలని, మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్నిస్తాయని, ఆహార విహారాదుల విషయంలో పరిశుభ్రత విధిగా పాటించినప్పుడే శారీరక ఆరోగ్యం స్థిరంగా ఉంటుందని సిద్ధాంతీకరించాడు. కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదని, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ బాగున్నప్పుడే మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చరకుడు స్పష్టం చేశాడు.
ఆధునిక వైద్యులు నేటికీ చరక సంహిత లోని వైద్య సూత్రాలను, సూక్ష్మాలను గ్రహించి వైద్యసేవలు అందించటం విశేషం. చరకుని వైద్యగ్రంథం "చరకసంహిత" మీద మరిన్ని ఎక్కువ పరిశోధనలు విస్తృతంగా జరగవలసి ఉంది. అప్పుడే సర్వమానవాళికీ ఆయుర్వేదం ఆరోగ్యప్రదాయనిగా పరిఢవిల్లుతోంది.
భాస్కరా చార్యుడు ‘ : 


క్రీ . శ 11 వ శతాబ్దం లో భాస్కరా చార్యుడు భారతీయ గణిత శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు . గణితం లో కలనగణ భాజ గణితం త్రికోణ మితి మొదలైన ఎన్నో ప్రక్రియలలో సులభ సూత్రాలను సిద్దాంతాలను రూపొందించారు భాస్కరుడు . భాస్కరా చార్యుడు రాసిన లీలావతి అనే గ్రంథం ఒక ‘వృత్తం’ లో ‘సమచతుర్భుజి ‘ , ‘పంచభుజి’ , ‘షడ్భుజ’ , ‘అష్టభుజముల’ తదితర సమ భాహు భుజాల యొక్క ఒక భుజము ఆ వృత్తం యొక్క వ్యాసమునకు ఒక నిశ్చి తమగు అనుపాతం లో ఉంటుంది అని తేల్చి చెప్పాడు .
ఇదేకాక త్రికోణ మితి సిద్దాంత సూత్రాలను వివరించాడు . కలణ గణితమును గూర్చి న భాస్కరుని ‘ సిద్దాంత శిరోమణి’ అనే గ్రంథం లో ‘గ్రహ గణితం’ లో ‘అవకలణం ‘ ప్రయోగాత్మకంగా వివరించాడు . భాస్కారాచార్యుడు బీజగణితం అంకగణితం గూర్చిన వివరణ ‘అవ్యక్త గణితం’ , ‘వ్యక్త గణితం’ అనే పేరుతో ‘లీలావతి’ అనే గ్రంథం లో వివరించాడు .a

ఆర్యభట్టు





భారతీయ గణిత శాస్త్ర సాంకేతిక ప్రతిభ గణిత అద్భుతాలు ‘సున్నా ‘ విలువ నిర్దారణ గణితం లో సున్నా లేకుంటే ఏమిటనేది అందరు గ్రహించిన సత్యం . సున్నా ప్రస్థావన వేదాలు , పురాణ ఇతిహాసాలలో మనకు కనిపిస్తుంది . క్రీ . పూ 200 లో పింగళుడు’ఛం అనే ఛంశా శాస్త్రవేత్త మొట్టమొదట ‘సున్నా ‘ గురించి వివరించాడు . ఉపనిషత్తులలో సున్నా ప్రస్తావన మనకు కనిపిస్తుంది ఈశా నోపనిష త్తు లో , శాంతి మంత్రంలో ” పూర్ణ మిదః పూర్ణ మిదం !” అనే ప్రస్తావన ఉంది . ఈ శ్లోకం అర్ధం ‘పూర్ణ స్థితి , శూన్య స్థితి ‘ అనే భారతీయ తత్వమునుండి ఈ ఆలోచనా విధానాన్ని ఆవిష్కరించారు . ఈ శ్లోకాన్ని గణిత పరంగా అన్వయించింది మనవాళ్ళే .
క్రీ . శ 620 లో ‘బ్రహ్మ గుప్తుడు ‘ అనే గణిత శాస్త్రవేత్త “బ్రహ్మ స్పుట సిద్దాంతం ” అనే గ్రంథం లో సున్నాను ఒక సంఖ్యతో భాగించి న ఎడల దాని శేషం అనంతం అని వివరించాడు .
ఇంకా సున్నా ప్రస్తావన క్రీ . శ 400 లో ‘సూర్య ప్రజ్ఞాప్తి ‘ అనే జైన గ్రంథం సున్నాను ప్రస్తావించింది . ‘ఆర్యభట్టియం ‘ అనే గ్రంథం లో అధ్యాయం రెండు , శ్లోకం 10లో ‘ఫై’ విలువను 3. 1416 అని వివరించాడు . వృత్తం యొక్క పరిధి , వ్యాసాల నిష్పత్తి ని’ ఫై ‘అంటారు . ఇదే కాక ఆర్యభట్టు తన గ్రంథం లో త్రిభుజ వైశాల్యం ఎలా కనుగొనాలో వివరించాడు సూత్రికరించాడు . (మరికొన్ని విశేషాలు తరువాతి సంచికలో ) సోర్స్ : భారతీయ ప్రతిభా విశేషాలు.
చరక మహర్షి



మానవ ఆరోగ్యం ఆటను తీసుకొనే ఆహారం మీదనే ఆధార పడుతుందని తెలుసుకొని ”చరక సంహిత ”అనే గ్రంధాన్ని రాసిన వాడు చరక మహర్షి .శారీరక అవసరాలకు కావలసిన శక్తిని ఆహారం ద్వారానే పొందాలని చెప్పాడు .విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి అనుకొనే వారు పన్నెండు రకాల ఆహార వర్గాలను గురించి తెలుసుకోవాలని వాటిని వివరించాడు .గింజలు ,పప్పులు మాంసం ,ఆకుకూరలు ,పండ్లు ,పచ్చని కూరగాయలు ,మద్యం నీళ్ళు ,చెరకు రసం తో తయారైన ఆహారం ,వండిన ఆహారం ,పాల పదార్ధాలు ఇతర తిని బండారాలు గురించేకాక ,అనేక సంప్రదాయ వైద్య చికిత్సలను కూడా తన గ్రంధం లో రాశాడు .
చరకుడు ఏ కాలం వాడో స్పష్టం గా తెలియదు .కాని ఆయన రాసిన సంహిత మాత్రం క్రీ.శ.987లో పర్షియన్ ,అరెబిక్ భాషలలోకి అనువాదమై పోయింది దానిని ”భేళ”అనే ఆయన రాసినట్లు చెబుతారు .చరక మహర్షి క్రీ.శ800వాడు అని అందరి నిర్ధారణ .చరకుడు చెప్పిన వైద్య విషయాలకు మూలం ఋగ్వేదం లో అధర్వ వేదం లో ఉన్నాయి .వాటిని క్రోడీకరించి స్వీయ అనుభవాన్ని జోడించి చికిత్సా విధానం రాశాడు .
చరక సంహిత ఎనిమిది ప్రకరణాలతో నూట ఇరవై అద్యాయాలతో ఉన్న గ్రంధం .సూత్ర స్థాన ,నిదాన స్థాన ,విమాన స్టాన ,శరీర స్థాన ,చికిత్సస్థాన ,కల్పస్థాన ,సిద్ధి స్థాన అనేవే ఎనిమిది ప్రకరణలు .ప్రతి అధ్యాయం లో విపులం గా ఆరోగ్య రక్షణ ,వ్యాధుల చికిత్సలను సూచించాడు .కాలు విరిగితే ఇనుప కాలు అమర్చే విదానం చెప్పాడు .అంధత్వం పక్ష వాటం ,కుష్టు ,మూర్చాస్ ,రాచపుండు అనే కేన్సర్ మొదలైన దీర్ఘ వ్యాధులకు సులభ నివారణోపాయాలు వివా రించాడు .
”జీవేమ శరదశ్శతం ”అన్న వేదం వాక్యాన్ని ఉదాహరిస్తూ నిండు నూరేళ్ళు మానవుడు హాయిగా ఆరోగ్య వంతం గా జీవించాలని కాంక్షిస్తూ ”చరక సంహిత ”రాశాడు .ఆయన పూర్వ నామం ”మహర్షి పునర్వసు ” కాని ఆయన రచించిన గ్రంధం పేరు చరక శాస్త్రమని కొందరు భావిస్తారు ..పునర్వసు మహర్షికి ఒక రోజు ఒక కోరిక కలిగింది. మారు వేషం లో నగరం లో సంచరిస్తూ ”కొ అరుగ్”అంటే ఆరోగ్యం లేని వారెవ్వరూ ?అని ప్రశ్నించటం ప్రారంభించాడట .అప్పుడు ఒకాయన ”చ్యవన ప్రాస ”తిన్నవారేప్పటికి రోగ గ్రస్తులు కారు అని జవాబు చెప్పాడట .ఇంకోడు ”చంద్ర ప్రభావతి ”తింటే రోగాలు రావన్నాడు .వేరొకరు ”వంగ భస్మం ”అన్నారు .కొందరు భాస్కర లవణం అని నిర్మోహ మాటం గా చెప్పారు ..అప్పుడు ఇవన్నీ విన్న పునర్వసుకు ఏడుపొచ్చినంత పని అయింది .తాను ఎంతో కస్టపడి వేదాల నుంచి అనేక విషయాలు సేకరించి వైద్య శాస్త్రం రాస్తే ఎవరూ అర్ధం చేసుకో లేక పోయారని బాధ పడ్డాడు .ఇంతలో ప్రాచీన విద్యా చార్యుడు ”వాగ్భాటుడు ”నదీ స్నానం చేసి వస్తు న్నాడు .మళ్ళీ పునర్వసు అదే ప్రశ్న వేశాడు .అప్పుడు వాగ్భాటు డు ”హిత భుక్తిహ్ మిత భుక్తిహ్ రుత భుక్తిహ్ ”అన్నాడు అప్పుడు పునర్వసు ఆనందం తో తన సంహితను మూడు ముక్కల్లో స్పష్టం గా చెప్పిన వాగ్భాటుడిని ప్రశంసించాడు .
చరకుడు తన వైద్య విధానం లో ”పాదరసం ”ను వాడాడు .ఇది మహా గొప్ప విషయమని వైద్య శాస్త్ర వేత్తలు అంగీకరించారు .శరీరం లో వాత ,పిత్త ,కఫాలు సమ తుల్యం లో లేక పొతే అస్వస్థత చేస్తుందని చెప్పాడు .దాటు లోపం వల్ల ఏ ఏ వ్యాధులు రావచ్చో వివరించాడు .చరక సంహిత ”మహా వైద్య విజ్ఞాన సర్వస్వం ”అంటారు అందరు .దీనిపై విపుల పరిశోధన చేసిన వారు నారదత్త ,చక్ర పాణి ,శివదాస ,వైన దాస ,ఈశ్వర సేన మొదలైన వారు .చరక సంహిత ఆధారం గానే యునానీ వైద్యం ప్రారంభ మయింది .
జన్యు శాస్త్రం లో కూడా చరకుని ప్రవేశం కని పిస్తుంది .లింగ నిర్ధారణ విషయమై అనేక ద్రుష్టి కోణాలను ఊహించి చెప్పాడు .శిశువు మూగ ,గుడ్డి ,చెవిటి గా జన్మిస్తే అది తలి దండ్రుల దోషం కాదని వారి శుక్ల శోనితాలాడే దోషమని చెప్పాడు .ఇవి జన్యు శాస్త్రానికి మూలాలు అయ్యాయి .ఇరవై శతాబ్దాల క్రితమే ఈ విషయాలను తెలియ జేసినా మేధావి చరకుడు .మానవ శరీరం లో మూడు వందలఅరవై ఎముకలున్నాయని నిర్ధారించి చెప్పాడు .గుండెకు సంబంధించిన వ్యాధులను వాటి చికిత్సా విధానాలను కూడా తన గ్రంధం లో చర్చించాడు .ప్రాచీన వైద్య శేఖరుడు ”ఆత్రేయ మహర్షి ”మార్గ దర్శ కత్వం లో అగ్ని వేశుని బోధలు ,రచనలను వృద్ధి చేసిన ఫలితం గా తన సంహిత పరి పుష్టి చెందిందని చరకుడు పేర్కొన్నాడు .సుశ్రుతుడు చరకుడు ,వాగ్భటుతుడు అంద జేసిన మూలికా విశిష్టత ద్వారా పన్నెండు అత్యంత ప్రధాన దేశాలలో భారత దేశం మొదటి స్తానం లో ఉంది .మన దేశ వ్యాప్తం గా ఉన్న మొక్కలలో నలభై శాతం వరకు ఔషధ ప్రయోగాలకు ఉపయోగ పడతాయని ఆధునిక వైద్య శాస్త్ర వేత్తలు అభిప్రాయ పడ్డారు .ఇతర దేశాలలో ఈ సగటు కేవలం పన్నెండు శాతమే .
చరక సంహిత లో ”స్మ్రుతి భ్రంశం ,ధృతి భ్రంశం ,బుద్ధి భ్రంశం ”గూర్చి ప్రస్తావన ఉంది న్యూరోసిస్ ,డిప్రెషన్ ,యాన్గ్సైటీ ,స్కిజోఫీనియా ,ఎపిలేప్సి ,ఉన్మాదం లకు ఏ ఇతర ప్రభావం చూపని గొప్ప వైద్య చికిత్స ను సూచించాడు .సర్ప గ్రంధి ,బ్రాహ్మీ ,జతామూసి ,వచ్చా ,స్వర్ణం ,తగరాలను ఔషధాలుగా వాడే పధ్ధతి తెలిపాడు .తలంటి శిరో వసతి శిరో తాపం ,అంజన కర్మ ,సస్య కర్మ మానసిక వ్యాధులకు గొప్ప చికిత్సలని చెప్పాడు .
చరక సంహిత అనంతర కాలం లో ”ఆయుర్వేద గ్రంధం ”గా రూపు దాల్చింది .ఆరోగ్య వంతుడి లక్షణం ”సమ దోషః సమాగ్నిస్చ ,సమధాతు మల క్రియః -ప్రసంనాత్మే ఇంద్రియ మనః శ్వాసతో ఇత్యభి దీయత్ ”అంటే వాతం పిత్తం కఫం అనే మూడు దోషాలు ,సప్త ధాతువులు ,మల విసర్జన మొదలైన వన్నీ సమ తుల్యం గా ఉండటం తో బాటు ,ఆత్మా ,ఇంద్రియాలు మనస్సు మొదలైనవి ప్రసన్న స్తితిలో ఎవరిలో ఉంటాయో వారే ఆరోగ్య వంతులు .చరక సంహిత లోని మూడు ముక్కలేమితో తెలుసు కొందాం
మొదటిది -హిత భుక్తి -మనం తినే ఆహారం మన శరీరానికి మేలు చేసేదిగా ఉండాలి .తినటానికే జీవించ రాదు .జీ విస్తున్నామ్ కనుక తినాలి .మనం తినే ఆహరం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలకు ఏది ప్రయోజన కరమో దాన్నే తినాలి
రెండోది -మిత భుక్తి -శ్రేష్టమైన తాజా ఆహారాన్నే మితం గా తినాలి .అతిగా తింటే తీపి కూడా చెడు అవుతుంది .సమంజసం గా తృప్తిగా తినాలి .హితమైంది మితం గా తినటం శ్రేష్టం .
మూడోది -రుత భుక్తి -జీవితాన్ని సఫలీకృతం చేసే మంచి ఆహారాన్ని తినాలి .న్యాయం గా సంపాదించినవే తినాలి అప్పుడే శారీరక ఆరోగ్యం తో బాటు మానసిక ఆరోగ్యం కూడా వర్ధిల్లు తుంది
విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహర్షి



భాగవతం లో సాల్వుడు ‘’సౌంభక ‘’అనే విమానం లో ద్వారకా నగరం మీద యుద్ధం చేశాడని ఉంది .గయోపాఖ్యానం లో గయుడు ఆకాశం లో రధం లో వెడుతూ ఉమ్మి వేస్తె అది శ్రీ కృష్ణ్డుడు సూర్యుని కిచ్చే అర్ఘ్యజలం లో పడటం ,అది శ్రీ కృష్ణార్జున యుద్ధం దాకా వెళ్ళటం తెలిసిందే .రామాయణం లో కుబేరుని ‘’పుష్పక విమానాన్ని ‘’రావణుడు లాక్కొని అనుభ వించాడు .దానిలోనే శ్రీ రామాదులు లంక నుంచి అయోధ్యకు చేరారని తెలిసిన విషయమే .వసు రాజు కు ఇంద్రుడు ఒక విమానం ఇచ్చాడు అది ‘’ఎయిర్ కండిషన్డ్ విమానం ‘’..దానిలో సకల సౌకర్యాలు ఉన్నాయి .
వి అంటే పక్షి .గాలిలో పక్షి లాగా ఎగిరేది విమానం అని పిలువ బడింది ..మహా భారత కాలానికే విమాన శాస్త్రం వృద్ధి చెందింది .ఋగ్వేదం లో విమాన యాన ప్రసక్తి ఉంది .మూడు చక్రాలతో ఆకాశం లో విహరించేరదాలున్నట్లు మన పురాణాలలో ఉంది .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’లో విమాన యానం కు సంబంధించిన రచన ఉంది .దీనికి అను బంధం గా ‘’సంస్కార రత్నావలి ‘’,’’శకట యానం ‘’,’’లోహ తంత్ర’’,’’యాన బిందువు ‘’మొదలైన గ్రంధాలు వచ్చాయి .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’ను భూర్జర పత్రాల మీద రచించిన భారద్వాజ మహర్షి వివరాలు అందు బాటు లో లేవు .
వు .
క్రీ.పూ.ఏడవ శతాబ్దిలో భరద్వాజుడు జన్మించినట్లు తెలుస్తోంది .తండ్రి బృహస్పతి .తల్లి మమత .హిమాలయ పర్వత సానువులలో జన్మించినట్లు భావిస్తారు .ఋగ్వేద అధర్వణ వేదం ,రామాయణ ,మహా భారతాలలో భరద్వాజ ప్రసక్తి ఉంది .ఈయనే విమాన శాస్త్ర రచయిత గా అందరు భావిస్తారు .భరద్వాజుడు రాసిన ‘’బృహత్ యంత్ర సంహిత ‘’లో విమాన శాస్త్రం ఒక భాగం మాత్రమె .ఇందులో అనేక పూర్వ గ్రంధాలను ఆధారం చేసుకొని రాసినట్లు చెప్పాడు .ప్రాచీన విజ్ఞాన గ్రంధాలు ముఖ్యమైనవి 25ఉన్నాయి .అవి ‘’వైశ్వానర తంత్రం ,ధూమ ప్రకరణం ,సౌదామిని కళ,శక్తి సూత్రం ,అంశు బోధిని ,వాయు తత్వ ప్రకరణం ,ఆకాశ తత్త్వం.
భరద్వాజుడు రాసిన విమాన శాస్త్రం కు విపులమైన వ్యాఖ్యానం రాసిన వాడు ‘’బోదా నంద’’ .ఆయన రాసిన ప్రకారం భరద్వాజుడు వేదాలను మదించి ,ఈ యంత్ర శాస్త్రాన్ని తయారు చేశాడు .భారద్వాజునికి పూర్వమే కొంతమంది విమాన శాస్త్రం పై అనేక పరిశోధనలు చేశారని,గ్రంధస్తం చేశారని తెలుస్తోంది .అయితే అవి అస్పస్టాలు అసంపూర్నాలు అవటం తో అసలు విషయం తెలియ లేదు .శౌనక మహర్షి రాసిన ‘’వ్యోమ యాన యంత్రం ‘’వాచస్పతి రాసిన ‘’యాన బిందు ‘’,నారాయణ రాసిన ‘’విమాన చంద్రిక ‘’దుండి నాధుడు రాసిన ‘’వ్యోమ యానార్క ప్రకాశిక ‘’,గార్గ్య మహర్షి రాసిన ‘’యంత్ర కల్పం ‘’,చక్రాయన రచించిన ‘’భేత యాన ప్రదీపిక ‘’మొదలైనవి భరద్వాజుని విమాన శాస్త్రానికి ముందువే .
భరద్వాజ విమాన శాస్త్రం లో ఎనిమిది అధ్యాయాలువంద అధికరణాలు,500సూత్రాలున్నాయి ,ఇదీ అసంపూర్తి గ్రంధమే .పూర్తీ గ్రంధం అలభ్యం .భరద్వాజుడు తన విమాన శాస్త్రం లో మొత్తం 32విమాన శాస్త్ర సిద్ధాంతాలు ఉన్నాయని పేర్కొన్నాడు .విమాన నిర్మాణం లో
32యంత్రాలున్నట్లు ,వాటిని ఎక్కడెక్కడ అమర్చాలో వాటి పనులేమిటో కూడా తెలియ జేశాడు .2005లో హరిద్వార్ లో ఆవిష్కరింప బడిన ఆమంచి బాల సుదాకర శాస్త్రిగారి రచన ‘’భరద్వాజ వైమానిక ‘శాస్త్రం ‘’లో కావలసిన వివరాలున్నాయట .శాస్త్రి గారు విజయ వాడలో ‘’మహర్షి కాల జ్ఞానం ‘’సంపాదకులట.ఇందులో మూడు వేల శ్లోకాలు వంద అధ్యాయాలు ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ లలో ఈ పుస్తకం వేలు వడిందట . మన దేశం లో రైట్ సోదరులకు పూర్వమే బొంబాయి లో’’ శివ శంకర్ బాపూజీ తల పడే ‘’అనే శాస్త్ర వేత్త1895లో మొదటి విమానాన్ని తయారు చేసి ఆకాశం లో ఎగిరెట్లు చేశాడట .ఈయన బొంబాయి చైనా బజార్ లో ఉండేవారు .సంస్క్రుత ఆంగ్లలో నిష్ణాతుడు .విజ్ఞాన పరిశోధనల్లో ఆరి తేరిన వాడు .బొంబాయి జే.జే.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో లెక్చరర్ .వేదం వాగ్మయాన్ని అవలోడనం చేసిన వారు .1913లో శివకర్ గారు ‘’ప్రాచీన విమాన విద్వేచా శోధ’’పేరుతొ మరాఠీ లో ఒక గ్రంధం రాశారు .భార్య మిత్రుల సహకారం తో వేదం లోని విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకొని విమానాన్ని నిర్మించారు .తన విమానానికి‘’మరుత్సఖ’’ (వాయు మిత్రుడు ).అని పేరు పెట్టారాయన .బొంబాయి లోని ఆర్ట్ సొసైటీ నిర్వహణ లో ఉన్న టౌన్ హాల్ లో ప్రదర్శించారు .పాదరసాన్ని ,సౌర శక్తిని ఇంధనాలు గా ఉపయోగించారు .బొంబాయి లోని ‘’చౌ పట్టి’’సముద్ర ప్రాంతం లో ప్రయోగించి నడిపించారు .1500అడుగుల ఎత్తు వరకు ‘’మరుత్సఖ ‘’యెగిరి క్షేమం గా భూమి మీదకు దిగింది .ఆ నాటి బరోడా యువరాజు సాయీజీ రావు గైక్వాడ్ ,ప్రసిద్ధ న్యాయ వేత్త మహా దేవా గోవింద రానడే ,వాణిజ్య వేత్త లాల్జీ నారాయణ్ జీ మొదలైన ప్రముఖు లందరూ ఈ విమానాన ప్రయోగాన్ని చూశారు .దీన్ని అభి వృద్ధి చేయటానికి కావలసిన ఆర్ధిక సాయం చేస్తామని వీరందరూ ప్రకటించారు .కొద్దికాలానికే ఆయన ఆరోగ్యం క్షీణించటం భార్య మరణించటం తో ,శివాకర్ గారు కూడా చని పోవటం తో ఈ ప్రయోగం ఆగిపోయింది .ఈయన వారసులు ఈ తోలి విమానాన్ని బ్రిటిష్ కంపెని కి అమ్మేశారు .బాల గంగాధర తిలక్ తన కేసరి పత్రిక లో 1953 may 10న ఒక వ్యాసం రాశారు ‘’శివకర్ తల పడే’’ విమాన ప్రయోగం గురించి పూర్తీ వివరాలు అందులో రాశారు .బ్రిటిష్ ప్రభుత్వం పరువు పోతుందనే భయం తో ఈ విషయాన్ని అంతకు ముందు
బయటికి పొక్క కుండా చేసింది. కాని తిలక్ గారి వల్లనే మొదటి సారి లోకానికి తెలిసింది .1950లో ‘’శిల్ప సంసార ‘’అనే పత్రిక వేదాలలో విమాన శాస్త్ర వివరాలను ధారా వాహిక గా రాచురించింది .1956లో జనవరి ఎనిమిదిన ‘’త్రిపుర ‘’పేరు తో ఒక ప్రత్యెక విమానానికి సంబంధించిన కొన్ని రేఖా చిత్రాలను ప్రచురించారు .ఈ విమానం భూమి మీద ,గాలి లోను ఎగుర గలదని తెలిపింది .
భారద్వాజుడి విమాన శాస్త్ర అధ్యయనాన్నిఅనేక మంది ఆధునిక శాస్త్ర వేత్తలు చేశారు .ఇందులో డాక్టర్ రామ ప్రభు ,డాక్టర్ మహేశ్వర్ సేరోన్ ,డాక్టర్ యెన్ జి దొంగ్రే ,పి రామ చంద్ర రావు మొదలైన వారున్నారు.
1956-60-ల మధ్య రష్యా నుంచి ఉయ్యూరు కు రెండు సార్లు వచ్చిన ఉయ్యూరు వాస్తవ్యూలు రష్యాలో ఆయిల్ శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతా రామయ్య గారు ఇక్కడ జరిగిన పౌర సన్మానం లోను విడిగా బంధువుల ఇంటి లోను మాతో మాట్లాడి నప్పుడు భరద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్రాన్ని జర్మనీ దేశశాస్త్రజ్ఞులు ఇండియా నుంచి తీసుకొని వెళ్లి జర్మని లో విమానాన్ని తయారు చేశారని చెప్పారు .
కణాదుడు



కనిపించె సృష్టి అంతా సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుల కలయికతో ఏర్పడినదే అని యిప్పటి ఆధునిక శాస్త్రవేత్తల నుంచి సామాన్య మానవుడి వరకు అందరికీ తెలిసినదే. అయితే ఈ పరమాణు రహస్యాన్ని మొట్టమొదటగా క్రీస్తు పూర్వ కాలంలోనే ప్రపంచానికి చాటి చెప్పిన ప్రాచీన భారతీయ అణు సిద్ధాంత కర్త కణాదుడు. పాశ్చాత్యుడైన్ దెమోక్రటీస్ 2400 సంవత్సరాల క్రితం ఈ పరమాణువునే "ఆటమ్" గా పేర్కొన్నాడు. "ఆటోమస్"(విభజింప వీలుకానిది) అనే గ్రీకు పదం నుండి ఈ ఆటం పుట్టినది. అయితే డెమోక్రటీస్ కు నాలుగు శతాబ్దాలకు ముందే ప్రకృతి లోని ప్రతి పదార్థం సూక్ష్మ కణాల మయం అని ప్రతిపాదించాడు కణాదుడు.
విశ్వంలో అణువు అనేది ఒకతి ఉంటుందన్న భావనను ప్రతిపాదించింది, ఆలోచనలు రేకెత్తించిన తొలి శాస్త్రవేత్త కణాదుడు. "కారణం - ప్రభాఅం " కార్యకారణ సంబంధం వల్లనే సర్వం సంభవమవుతుందని సిద్ధాంతీకరించాడు. ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతమైన {E=mc^2} ప్రతిపాదనకు మూలాలు కణాదుడి సిద్ధాంతమే.
ఈ ప్రపంచం అంతా పరమాణువులతో నిర్మితమైంది. వివిధ శైలీ విన్యాసాలతో పరమాణువులు సమ్మిళితమై సృష్టిలోని సమస్త ఆకారాలు ఏర్పడుతున్నాయి. ప్రకృతిలో కనబడుతున్నా సూర్యుడు . చంద్రుడు , నక్షత్రాలు , సముద్రాలు , పర్వతాలు , అరణ్యాలు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, నుండి మానవుని వరకూల్ చీమ నుండి డైనోసార్ అరకు అన్నీ...అన్నీ అణువుల కలయిక వలనే ఏర్పడుచున్నవి. ఇవన్నీ ఒకదానితో ఒకటి పోలిక లేనివి. విభిన్న ఆకృతులు కలిగినవి. వాటి, వాటి వ్యవహార సరళి కూడ ఒకదానితో ఒకదానికి పోలిక లేని వైవిద్యం కలిగి యున్నాయి. అన్నీ అణువుల సముదాయమే అయినప్పుడు ఈ వైవిద్యం ఎలా సాధ్యపడింది?
కణాదుడు సిద్ధాంతం ప్రకారం "పదార్థమంతా అణువుల సంయోగం చేత సృష్టించబడుతూ ఉంటుంది. ఆయా అణువుల గుణాలు, ధర్మాలు, సంయోగాన్ని అనుసరించి పదార్థం యొక్క భౌతిక రుపం, స్వభావాలు మారుతూ ఉంటాయి. పదార్థాన్ని ఇంకా విభజించడానికి వీల్లేని భాగమే అణువు. అణువులే ప్రపంచానికి మూలాధారం. మూలకారణం. దార్యం లేకుండా కారణం జరగదు "అణువు"కు నాశనం లేదు. అణువులు నాలుగు గుణాలతో నాలుగు రకాలుగా ఉంటాయి. ఒకే గుణం, ఒకేరకంగా ఉండే ఏకథర్మ అణువులు సంయోగం వలననే ఆయా వస్తువుల నిర్మాణం జరుగుతుంది. ఈ కలయిక మళ్ళీ రెండు విధాలుగా ఉంటుంది. 1)అణువుల్లో అంతర్గతంగా ఉండే సహజ భౌతిక శక్తి 2) అణువులకు బహిర్గతంగా ఉండే మానవాతీతశక్తి.
మరింత వివరంగా చెప్పుకోవాలంటే వివిధ వస్తువుల స్వభావ ధర్మాన్ని బట్టి, ఆయా వస్తువులు తమలోఉన్న కణ సంయోగాన్ని బట్టి రూపం ఏర్పరచుకుంటాయి. ఏక స్వభావం కలిగిన కణాలు అనేకం ఒకదానితో ఒకటి కలిసి వస్తురూపం పొందుతాయి. కణంలో ఉండే స్వభావం వస్తువులలోనూ కనిపిస్తుంది.
ఉదాః అగ్నితత్వం గలిగిన అనేక అగ్నికణాలు(అణువులు) సంయోగం చెంది, సూర్యగోళం యేర్పడింది. అగ్నికణాలలో ఉండే అగ్నితత్వమె భౌతిక వస్తురూపం దాల్చిన సూర్యగోళం నుండి వేడిమిని వెదజల్లుతుంది.




ఆచార్య నాగార్జునుడు




రసాయన శాస్త్రానికి బీజాలు వేసి ,రస వాద సిద్ధాంతానికి మహా ప్రయోగాలు నిర్వహించిన బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు .క్రీ.శ.931లో గుజరాత్ లోని సోమనాధ దేవాలయ సమీపం లో దైహాక్ అనే గ్రామం లో జన్మించి నట్లు తెలుస్తోంది .బౌద్ధం లో మహా యాన విభాగం లో మాధ్యమిక ,యోగాచార అనే రెండు విధానాలలో మాధ్యమిక చింతనను ప్రతి పాదించిన వాడే నాగార్జునా చార్యుడు .ఈయన రచించిన ‘’మాధ్యమిక కారిక ‘’గ్రంధం బౌద్ధ దర్శనాలలో అగ్ర శ్రేణి లో నిల బడింది .దీనితో ఆయన ‘’ఆర్య నాగార్జునుడు ‘’అని పించుకొన్నాడు .గుంటూరు జిల్లా మహా మండల ప్రాంతం లో శ్రీ పర్వత సానువులలో చాలా కాలం నివశించాడు .ఇక్కడి ఈ పర్వతానికే ‘’నాగార్జున కొండ ‘’అనే పేరొచ్చింది .ఇక్కడే ఒక విశ్వ విద్యాలయాన్ని స్తాపించి ఎందరికో విద్య నేర్పించాడు. దేశ ,విదేశాల నుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి వచ్చి చదువుకొన్నారు .
కాని నాగార్జునుడు అంటే బంగారాన్ని కృత్రిమం గా తయారు చేసే వాడనే పేరు స్తిరపడి పోయింది .ధాతు విజ్ఞాని గా పాపం గుర్తింపు పొందలేదు .అందుకే ఆధునిక శాస్త్ర వేత్తలకు ఆయన దూరమై పోయాడు .పాదరసం వాడకాన్ని మొదటి సారిగా ప్రయోగించిన వాడు నాగార్జునుడే .దీన్ని శుద్ధి చేసే ప్రక్రియ ను కూడా ఆయనే ప్రపంచానికి తెలియ జేశాడు .పాదరసం తో బంగారం తయారు చేసే వాడని చరిత్ర కారులు చెప్పారు .బంగారు తయారీ లో పాద రసాన్ని తప్ప ఏ ఇతర ధాతువును వాడలేదు ఆచార్యుడు .ఆధునికులు బంగారం లో ఎనభై ప్రోటాన్లు ,ఎలేక్త్రాన్లు ఉన్నాయని పాదరసం లో డెబ్భై తొమ్మిది ప్రోటాన్లు ఎలేక్త్రాన్లు ఉన్నాయని కనుక్కొన్నారు మరి ఆ నాడే ఈ రహస్యాం నాగార్జునికి ఎలా అవగత మైనదో ఆశ్చర్యం వేస్తుంది .
ఆచార్య నాగార్జుండు అనేక వైద్య గ్రంధాలు రాశాడు .రస ప్రక్రియ అంటే ఆల్కెమీ కూడా నేర్చి నట్లు అని పిస్తుంది .ఆయన కాలం లో ‘’విజ్ఞాన వాదం ‘’ప్రారంభం అయి తర్వాత కూడా వ్యాప్తి చెందింది .అదీ ఆయన ఘనత .ఈ నాగార్జునుడు వేరు ఏ లోహాన్నైనా బంగారం గా మార్చ గలిగే ‘’పరసు వేది ‘’ని కని పెట్టిన సిద్ధ నాగార్జునుడు వేరు అనిఅనేక కధలు ప్రచారం లోఉన్నాయి . దీనితో నాగార్జునా చార్యుడు రసాయన శాస్త్రానికి చేసిన అద్వితీయ కృషి మరుగున పడి పోయింది .నాగార్జునుడు వివిధ లోహాలను ప్రకృతి నుంచి సేకరించి వాటిని శుద్ధి చేసే విధానం కని పెట్టాడు .రాత్రి వేళల్లో అడవుల్లో కాంతులు ప్రసరించే అనేక మూలికలను సేకరించి ప్రయోగాలు చేశాడు .వృక్ష సంబంధ పదార్ధాల తోను అనేక ప్రయోగాలు చేసి నమోదు చేశాడు .వీటి నన్నిటిని ‘’రస రత్నాకరం ‘’లో వివరించాడు .
ఆచార్యుడు రసాయన శాస్త్రం లోనే కాకుండా వైద్య ,యోగ శాస్త్రాలలో కూడా సృజనాత్మక కృషి చేశాడు .రస రత్నాకరం తో బాటు ‘’కక్షపుట తంత్రం ‘’,’’ఆరోగ్య మంజరి ‘’,యోగసారం ‘’యోగాస్టకం ‘’మొదలైన రచనలు చేశాడు .తన సిద్ధాంతాలను జన సామాన్యానికి అందించాలని ఎంతో తపన పడ్డాడు .దీనికి ఒక చిట్కా చేశాడు .ఈ అపూర్వ విజ్ఞానం అంతా తనకూ దేవతలకు మధ్య జరిగిన సంభాషణల వల్లనే అబ్బిందని అందరికి చెప్పాడు ఈవిషయాన్ని రస రత్నాకరం లో చెప్పాడు కూడా .
నాగార్జునుని రస రత్నాకరం ఆధునిక రసాయన శాస్త్ర వేత్తలకూ ప్రామాణిక గ్రంధమే అయింది .తన గ్రంధాలలో వాదప్రతి వాదాలరూపం తో ఆకట్టుకొనే విధం గా విజ్ఞానాన్ని అందించాడు .ఈయనకున్న మహిమల్ని జనం విస్త్ర్తుతం గా ప్రచారం చేశారు .ఈయన ప్రయోగించిన చిట్కా వల్ల ప్రాచీన శాస్త్ర వేత్త లెవ్వరికి రాని ప్రచారం ఆచార్యునికి దక్కింది .రస రత్నాకరం లో రసాయన మూల కాల వివరణ బాగా ఉంది .రాసాయనిక యౌగికాల గురించి మొట్ట మొదట తెలియ జేసిన వాడు నాగార్జునుడే .ఇదే ఆ తర్వాత మెటలర్జీ ,ఆల్కేమీ గా వృద్ధి చెందాయి. రాగి, సీసం ,టిన్ ,వెండి బంగారం మొదలైన ముడి లోహాలను ఖనిజాల నుండి ఏ విధానం లో సంగ్రహించాలో వాటిని ఎలా శుద్ధి చేయాలో మొదలైన అమూల్య విషయాలు ఈ గ్రంధం లో రాశాడు .ఆయన మేధస్సును అంచనా వేయటం కష్టం .రస రత్నాకరం ఒక ప్రయోగాత్మక రసాయన శాస్త్రం .ప్రయోగాల వల్లనే వివిధ ధాతువుల నిర్మాణం, మేళ వింపు ప్రయోజ నాలు తెలుసుకోవచ్చని చెప్పాడు ప్రకృతిలో దాగి ఉన్న ఖనిజాలు ,మొక్కలు, మూలికలు,తృణ ధాన్యాలు మొదలైన వాటిని ఆరోగ్య సంరక్షణ కై ఔషధాలను తయారు చేసుకోవచ్చునని సూచించాడు ,
‘’సిన బార్ ‘’(ఇంగిలీకం )నుండి పాదరసం తయారు చేయచ్చని ,’’కాలమైన్ ‘’సీసాం లాగా కనీ పిస్తుందని దీన్ని కూడా తయారు చేయ వచ్చునని ఈ గ్రంధం లో రాశాడు .దాతువుల్లో ఉన్న హాని చేసే పదార్ధాలను తొలగించి వాటిని ప్రయోజన కరమైన వాటిగా మార్చే విదానాలెన్నో చర్చించాడు .ఆరోగ్యం కోసం కొద్ది మోతాదులో పాదరసం ,గంధకం ఇంగువ కలిపీ తింటే ఆయుస్సు పెరుగుతుందనీ తెలియ జేశాడు .దీన్నే ఇప్పుడు ‘’రస సింధూరం ‘’గా పిలుస్తున్నారు .మనిషి లో ప్రాణ శక్తి ,దీర్ఘకాల జబ్బుల వల్ల ‘’ఓజస్సు ‘’క్షీనిస్తుందని ,మళ్ళీ దాన్ని పొందాలంటే రసాయన పదార్దాలే గతి అని స్పష్టం గా చెప్పాడు .శరీరం లో రసం ,రక్తం మాంసం ,మేధస్సు ,ఆస్థి ,మజ్జ ,శుక్లం వల్లనే ‘’ఓజస్సు ‘’ఏర్పడుతుంది .కనుక ఓజస్సు తగ్గితే రసాయనిక చికిత్సే అవసరం అవుతుందని చెప్పాడు .వ్యాధి నిరోధక శక్తి పెరిగి ప్రాణ శక్తి పెరిగి సూక్ష్మ జీవులు నసించితే తే ఓజస్సు వృద్ది చెందుతున్దన్నాడు
వ్యాధిని వివారించటం తో బాటు నియంత్రించటం లో కూడా శ్రద్ధ చూపించాలన్నాడు. ఆచార్యుడు .శుశ్రుతుడు రాసిన ‘’సుశ్రుత సంహిత ‘’ఆధారం గా ‘’ఉత్తర తంత్ర ‘’రాశాడు .దీని అసలు ప్రతి ఇతర దేశాల్లో వ్యాపించటం తో దాని వివరణలు
మనకేమీ తెలియ లేదు .ప్రక్రుతి సిద్ధ మైన రోగ నిరోధక శక్తి ని పెంచటానికి ఇందులో లొ చాలా విషయలున్నాయట..పాదరాసాన్ని పద్దెనిమిది సార్లు శుద్ధి చేసి,ఆ ద్రావకం లో వన మూలికల కషాయాన్ని రంగరించి విపరీతం గా చిలికితే అందులోని గంధకం ,అభ్రకం కొన్ని క్షారాలు కలిపి మళ్ళీ పది హేడు సార్లు శుద్ధి చేస్తే ‘’స్వర్ణ లోహం ‘’ఏర్పడుతుంది అని వివ రించాడు నాగార్జునుడు .అయితే ఇందులో ఏవి ఎన్నిపాళ్ళు ఉండాలో స్పష్టం గా లేదట .జింక్ ను మూడు రెట్ల రాగితో కలిపి అత్యధిక వేడిలో ఉంచితే ఇత్తడి ఏర్పడుతుంది .కాని బంగారం ఎలా ?దీన్ని ఒక శ్లోకం లో రస రత్నాకరం లో వర్ణించాడు ,
‘’క్రమేణా క్రుత్వామ్బుధరేణ రంజితః – కరోతి శుల్వం త్రిపుటేన కాంచనం’’ కాని ఇంత వరకు ఎవరికీ ఇది అంటూ బట్ట లేదట .ఇలా రసాయనిక శాస్త్రానికి ఆద్యుడయ్యాడు ఆచార్య నాగార్జునుడు .
నాగార్జునుడు ఏర్పరచిన విశ్వ విద్యాలం లో బౌద్ధ భిక్షువులు ,సన్యాసులు అనేక దేశాల నుండి వచ్చి చేరి చదువు కొనే వారు అన్ని శాస్త్రాలను ఇక్కడ విద్యార్ధులు నేర్చుకొనే అవకాశం ఉండేది .ఇక్కడే 108అడుగుల వ్యాసం ,86అడుగుల ఎత్తు ,ఉన్న మహా స్తూపం ఉంది .దీన్ని పద్దెనిమిది అంగుళాల పొడవు ,తొమ్మిది అంగుళాల వెడల్పు ,నాలుగు అంగుళాల మందం తో చేసిన ప్రత్యెక ఇటుక లతో ఈ స్తూపాన్ని నిర్మించారు .విజయ పురి అంతర్జాతీయ బౌద్ధ విహార కేంద్రం అయింది ఇప్పటి నాగార్జున సాగర్ కు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో ‘’అనువు ‘’అనే చోట ఇక్ష్వాకుల కట్టడాల్ని పునర్నిర్మించారు
నాగార్జునుడు సకల శాస్త్ర పారంగతుడని అపర ధన్వంతరి అని శాస్త్ర శాస్త్ర ప్రవీణుడు అని తత్వ వేది, తార్కికుడు ,ఖనిజ కళా నిష్ణాతుడు ,వేదంవేదంగ విద్యా విశారదుడు ,కవి సార్వ భౌముడు ,కళోపాసకుడు ,మాధ్యమిక వాద మహా ప్రవక్త ,మహా యాన మార్తాండుడు ,శతాధిక గ్రంధ కర్త అని ఎందరో తమ రచనల్లో ఆయన ప్రతిభా విశేషాలను ప్రస్తుతించారు .చిన్ననాటే వేదం వేదంగ పారంగతుడై ,వివాహ ప్రసక్తి లేకుండా సన్య సించి సర్వ జ్ఞాని అయ్యాడు అని చరిత్ర కారుల అభి భాషణ .భారతీయ రస వాదుల్లో ప్రప్రధముడు .బట్టీ పట్టటం (దిస్తిలేషన్ )శుద్ధిచేయటం (సబ్లిమేషన్ )భస్మం చేయటం (కాల్సి నేషన్ )మొదలైన పద్ధతుల్లో లోహాల రంగులు మార్చటం ,లోహ మిశ్రమం (అల్లాయ్ల్ )అగ్ని శీలా (పైరైట్స్త్స్ )నుంచి రాగి తీయటం ,మెటాలిక్ ఆక్సైడ్స్ ,ఆక్సైడ్స్ ఆఫ్ బ్రాస్ మొదలైనవి నాగార్జున మేధో జనితాలే వైద్యం లో ‘’కజ్జోలి ‘’అన బడే బ్లాక్ సల్ఫైడ్ ఆఫ్ మెర్క్యురి ని పరచయం చేసిన వాడు కూడా ఆచార్యుడే .తన శాస్త్రీయ ప్రయోగ వివరాలను శిలలపై చెక్కించాడు .లోహ సంగ్రహణ శాస్త్రానికి (మెటలర్జీ )కి ఆద్యుడయ్యాడు .ఆచార్య నాగార్జుడిని మొదటి నాగార్జునుడు అంటారు .
ఆధునిక భౌతిక శాస్త్రం లో లేజర్ కిరణాల సహాయం తో అణువు కేంద్రకం లోని ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్యను మార్చే అవకాశం కలిగింది . ప్రోటాన్ సంఖ్య మారితే ఒక మూలకం ఇంకో మూలకం గా మారుతుందని రుజువు అయింది .లేజర్ తో రాగి కేంద్రాణువులో ఒక ప్రోటాన్ చేరిస్తే నికెల్ అయి పోతుంది .అలానే ‘వల్కన్ ‘’అనే శక్తి వంత మైన లేజర్ నుపయోగించి బంగారాన్ని పాదరసం గా మార్చ గలిగారు ఈ నాటి శాస్త్ర వేత్తలు .వీటి కన్నిటికి ఆచార్య నాగార్జునుని మౌలిక భావనలే ఆధారం .
రెండవ నాగార్జునుడే ‘’’సిద్ధ నాగార్జునుడు ‘’క్రీ.శ.600వాడు .రస విద్య లో అఖండుడు .పుణ్య సాధువు అనే ఆయన మేనల్లుడు .జైన తత్వ వేత్త .వైద్య ప్రకాన్దుడు అని పించుకొన్న పూజ్య పాదుల వద్ద ఉద్యోగి. జైనుడుగా పుట్టినా బౌద్దం స్వీకరించాడు .దేశం లో ను నేపాల్ ,టిబెట్ లలో పర్యటించి బౌద్ధ ప్రచారం చేశాడు శ్రీశైలం కొండడకు వచ్చి ‘’నాగార్జున బోధి సత్వ ‘’గా ప్రసిద్ధుడైనాడు. అనేక రసాయన ప్రయోగాలు చేశాడు .రస వాదవిద్య ద్వారా మోక్షాన్ని పొందాడు అందుకే సిద్ధ నాగార్జునుడుగా అందరూ ఆరాధించారు .’’రస కాచ పుట ‘’,’’కక్షు పుట తంత్ర ‘’,మొదలైన గ్రందాల రచయితగా సుప్రసిద్దుడయ్యాడీ సిద్ధ నాగార్జునుడు .
మూడవ నాగార్జునుడు –అసలు పేరు ‘’భదంత నాగార్జున ‘’క్రీ.శ.ఏడవశతాబ్దివాడు . కేరళ కు చెందిన బౌద్ధ సన్యాసిగా చరిత్ర పుటల కెక్కాడు .ఆయుర్వేదం లో ఆనాడు ప్రసిద్ధ మైన అనేక గ్రందాలు చదివి జీర్ణం చేసుకొన్నాడు .’’రస వైశేషిక సూత్ర ‘’అనే గ్రంధం రాశాడు .ఆయుర్వేద వైద్యానికి చెందిన మౌలిక సూత్రాలను ఇందులో చర్చించాడు .ఇది486సూత్రాలతో నలుగు అధ్యాయాలుగా ఉంది .స్వతంత్ర విధానం గా అలోచించి రాశాడు .తన శైలిలో ‘’నాగార్జుని యాన్ ‘’అనే ప్రత్యెక వైద్య స్సంప్రదాయాన్ని నెల కొల్పి అనేక మందికి తర్ఫీదు ఇచ్చాడు .మొత్తం మీద నాగర్జునులు ముగ్గురూ ముగ్గురే .వైద్య రసాయనాలకు ముగ్గులేసి వ్యాప్తి చెందించిన వారే .
రసాయనిక ,రస సిద్ధాంతాలకు అలనాటి శాస్త్రజ్ఞుల కృషి



భారతీయ ప్రాచీన రసాయన శాస్త్ర విజ్ఞానం కొన్ని శతాబ్దాల పాటు అజ్ఞాతం లో ఉండి పోయింది .భారత ‘’రసాయనిక పారిశ్రామిక పిత’’అని పేరొంది ,ప్రపంచ రసాయన శాస్త్ర వేత్త అయిన ‘’ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే’’రాసిన ‘’హిందూ కేమిస్త్రి ‘’అనే పుస్తకం లో భారతీయ రసాయనిక శాస్త్ర వేత్త ల గురించి సంక్షిప్తం గా చెప్పారు .దీని వల్లనే మొదటి సారిగా మన రసాయనిక విజ్ఞానం లోకానికి తెలిసింది .ఆ కాలం లో’’ధాతు విజ్ఞానం ,చికిత్సా విజ్ఞానం మేళ వింపు’’ నే’’రసాయనిక శాస్త్రం’’ గా భావించే వారట .సాధారణ రసాయన పదార్ధాలను ముఖ్య రసాలు ,ముఖ్య రసాయన పదార్ధాలను మహా రసాలు ,ఉప రసాలు ,సామాన్య రసాలుగా వాటిగా పేర్కొన్నారు.ఆమ్లాలు క్షారాలు ద్రవాలు సొల్యూషన్స్ ఇవన్నీ వారికి తెలిసినవే .
మన పూర్వ రసాయన శాస్త్ర వేత్తలు వాడిన పారి భాషిక పదాలనే రసాయన శాస్త్రం లో వాడుతున్నారు రే.గారు రాసిన గ్రంధం లో ప్రాచీన రసాయన శాస్త్ర వేత్తల జీవితాలు రచనలు చోటు చేసుకొన్నాయి .నాగార్జునుడు ‘’ఆరోగ్య మంజరి ‘’,’’రస రత్నాకరం ‘’,కష పుట తంత్రం ‘’,యోగ సారం ‘’,యోగాస్టకం మొదలైన గ్రంధాలు రాశాడని గోవిందా చార్యుడు ‘’రసార్ణవం ‘’రాస్తే ,యశోధరుడు ‘’రస ప్రకాస సుధాకరం ‘’,సోమదేవుడు ‘’రసేంద్ర చూడామణి ‘’వాగ్భటుడు ‘’రస రత్న సముచ్చయం ‘’,రామ చంద్రుడు ‘’రసేంద్ర చింతామణి ‘’రాసి నట్లు రే చెప్పారు .పూర్వ రసాయన శాస్త్రజ్ఞులు ప్రయోగాలకోసం వైద్యానికి మాత్రమె ప్రయోగాలూ నిర్వహించే వారని తెలియ జేశారు .ధాన్యాలు ,పండ్లు ,దుంపలు ,కర్రలు పుష్పాలతో మద్యం తయారు చేసే వారు వీటికే ఆసవాలు అనే పేరు .వివిధ రోగాలకు వీటిని ఔషధం గా వాడే వారట .మొత్తం తొమ్మిది రకాల ఆసవాలున్నట్లు ఆయన చెప్పారు .సుగంధ ద్రవ్యాలు ,అత్తర్లు గంధాలు ‘’రస శాల ‘’అనే ప్రయోగ శాలలో తయారు చేసేవారు. శాస్త్ర విజ్ఞానాన్ని గురు ముఖతా విని స్వంతం గా ప్రయోగాలు చేసి సిద్ధాంతాలను రూపొందించే వారట .వీరి ధాతు విజ్ఞానం ,చికిత్సా విధానం వైద్య శాస్త్రం లో ఈ రూపం గా ప్రవేశింది .
ఆనాటి రసాయన శాస్త్ర వేత్తలు
-ధుండు నాధుడు –పద్నాలుగో శతాబ్దానికి చెందిన వాడు .కాల నాద మహర్షి శిష్యుడు .’’రసేంద్ర చింతామణి ‘’రచయిత .ఇందులో ఎనిమిది రస సంస్కార విధానాలు చెప్పాడు దీర్ఘ కాల వ్యాధులకు చికిత్సలు సూచిన్చాడు.వైద్యం రస వాదాల మీద పూర్తీ పట్టు ఉన్న వాడు
బిందు –మహా రాష్ట్ర వాడు ‘’రస పద్ధతి రచయిత .అనేక ఔషధాలు రస సంస్కారాలు ఇందులో ఉన్నాయి .సృజన శీలి .
కుమారుడు మహా దేవా తండ్రి గ్రంధానికి వ్యాఖ్యానం రాశాడు ఇందులో మరాఠీ పదాలే ఎక్కువ .
చక్ర పాణి దత్త -1040లో బెంగాల్ లోని భీర్భం లో పుట్టాడు .సంకల కర్త ,వ్యాఖ్యాన కర్త ,.చరక సంహితను అద్భుత వ్యాఖ్యానం గా ‘’ ఆయు ర్వెద దీపిక ‘’రాశాడు .’’చికిత్స సంగ్రహ ,ద్రవ్య గుణ సంగ్రహ ,భానుమతి ఇతని ఇతర రచనలు .ఔషధ నిఘంటువు ను ‘’ ముక్తా వలి ‘’పేరు తో వెలయింప జేశాడు .ఆ నాటి ప్రసిద్ధ వైద్యుడు ‘’నారద దత్త ‘’శిష్యుడై ఘన కీర్తి పొందాడు .
రస వాద విజ్ఞానులు
ఆనంద భారతి -1503-1600వాడు ‘’ఆనంద సిద్ధ ‘’పేరు తో ప్రాచుర్యం పొందాడు .యతీన్ద్రుడు గా నిలిచి పోయాడు .రస వాదం లో ఎన్నో ప్రయోగాలు చేశాడు .దీని పై ‘’ఆనంద మాల ‘’గ్రంధం రాశాడు .ఎనిమిది రకాల పాత్రల స్వరూపాన్ని చెప్పాడు .పాదరాసాన్ని శద్ధి చేసే విధానం చెప్పాడు .తైలాలు ఘ్రుతాలు ,గుళికలు మొదలైన మందుల తయారీ విధానాలను తెలియ జేశాడు .
గోవిందా చార్య –14-15శతాబ్ది వాడు .గుజ రాత్ లో సురాదిత్య కు కుమారుడు .బోధకుడు గా పసిద్ది .సృజన శీలి .’’రస సార’’ గ్రంధ రచయిత . జరణ ,బంధ మొదలైన రస సిద్ధాంతాలపై ఇందులో చర్చించాడు .రస విద్య మీద వచ్చినగోప్ప సిద్ధాంత గ్రంధం ఇదే .ఈ గ్రంధం అత్యంత ప్రామాణికం గా భావిస్తారు .
రామ చంద్ర -14వ శతాబ్దం వాడు .రస సిద్ధాంతానికి ,ప్రయోగాలకు పేరు పొందాడు .సంస్కృతం లో ‘’చక్ర దత్త ‘’,నమక’’ ‘’రసేంద్ర చింతామణి ‘’రాశాడు .రసాయన పొడులు ,భస్మాల విషయాలన్నీ వివరం గా ఇందులో చెప్పాడు .అనేక రోగాలకు ఖనిజాల నుండి తయారు చేసిన ఔషధాల గురించి రాశాడు
రామ కృష్ణ భట్టు –పదహారవ శతాబ్ది వాడు .ఏప్రాంతం వాడో ఖచ్చితం గా తెలీదు. తండ్రి నీల కంఠ ఔషధ శాస్త్రం లో ప్రఖ్యాతుడు .పాద రస రూప కల్పనలో సిద్ధుడు ‘.’రసేంద్ర కల్ప ద్రుమం ‘’అనే సంస్కృత గ్రంధ రచయిత .ఇది పాదరసానికి చెందిన గొప్ప సిద్ధాంత గ్రంధం గా పేరు తెచ్చుకోంది. పాదరసం తయారీ లో అనేక విధానాలను ఇందులో చర్చించాడు .
రామేశ్వర భట్టు –పద్నాలుగో శతాబ్ది వాడు .పాదరసాన్ని ఉపయోగించి అనేక ఔషధాల తయారీ ని చెప్పాడు. పాదరస శుద్ధి ,దాని గుణాల మీద ‘’రస రాజ్య లక్ష్మి ‘’అనే సిద్ధాంత గ్రంధాన్ని రాశాడు
రుద్ర-క్రీ పూ.వాడని అంటారు.అనేక వైద్య గ్రంధాల లో ఈయన పేరు ప్రస్తావించారు ‘’రు యామచరిత్ర ‘పరాద కల్ప ‘’’ధాతు కల్ప ‘’,హరితల కల్ప ‘’(పసుపు పచ్చని తైలాల తయారీ ),’’అభ్రక కల్ప ‘’(అభ్రకం నుంచి ఔషధాల తయారీ )మొదలైన అరవై కి పైగా వైద్య గ్రంధాలు రాసి మహా కీర్తి వంతుడయ్యాడు .‘’,
కణాదుడు




ప్రపంచం లో ప్రతి పదార్ధం సూక్ష్మ కణాల మయం అని రెండు వేల ఎనిమిది వందల క్రితమే చెప్పిన భారతీయ శాస్త్ర వేత్త కణాదుడు .ఈతని తర్వాతే దేమాక్రటీ స్ అనే గ్రీకు శాస్త్ర వేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కాన సముదాయం అని అంతకంటే చిన్న కణాలుగా విభజించటం కుదరదని చెప్పాడు .వీటినే అణువులు అన్నాడు గ్రీకు లో ఆటోమాస్ అంటే విభజించాతానికి వీలుకానిది అని అర్ధం .అనువులున్నాయని నిరూపించా లేక పోయాడు
కఠోపనిషత్తు లో ప్రపంచ పరిణామానికి జడ పదార్దమే కారణం అని ఉంది దీనినే ప్రధాన అవ్యక్త తత్వానికి ఆధారం గా తీసుకొని మన వాళ్ళు వేరే మార్గం లో పయనించారు కపిల ,కణాదుల భౌతిక సిద్ధాంతం తర్వాత బౌద్ధం వచ్చింది తర్వాత జైనమతం హేతు వాదం తో వృద్ధి చెందింది .బౌద్ధ ,జైన శాస్త్ర వేత్తలు కనాడ కపిలులనే ఆధారం గా తీసుకొన్నారు .దేమోక్రాతిస్ కు ముందే కణాదుడు జన్మించాడు వైశేషిక దర్శనం లో ”అన్విక విశిష్టత ”ఉంది .వైషేశికం లో ఆధునిక శాస్త్ర వేత్త ”ఔలూక్యుడు ”.ఈ నాడు మనం చెప్పే శాస్త్ర వేత్త ,పరిశోధకుడు అనే పేర్లు ఆయనకే సరి పోతాయి ఆయనే కణాదుడు .డేమోక్రాటిస్ కు నాలుగు వందల ఏళ్ళ క్రితమే కణాదుడు పుట్టాడు .
”ఆధునిక అణు వైశేషిక సిద్ధాంతం ”నూతన అధ్యాయానికి దారి తీసింది .”అణు భక్షకుడు ”అని కణాదుడు పేరు పొందాడు .కణాదుడు అంటే కణాలు తినే వాడని అర్ధం .”అణుస్ ”అనే సంస్క్రుత్సపడమే ఆటం అయింది ఇంగ్లీషులో .సూదులను అయస్కాంతం ఆకర్షించటం ,మొక్కలలో జల ప్రసరణ జడం అనేది ఈధర్ లేక అయస్కాంతం లో ప్రసారం చేయటానికి ఆధారమవటం ,అన్ని రకాల వేడికి సూర్యుడు ,అగ్నియె కారణం ,భూమి అనువులలో ఉండే ఆకర్షణ శక్తియే గురుత్వాకర్షణకు కారణం అన్ని శక్తులకు ఉండే చలన స్వభావానికి మూల కారణం శక్తి వ్యయం లేక తిరిగి తిరిగి చలనం కోన సాగటం అను విచ్చ్చ్చేడం ద్వారా విశ్వ ప్రళయం ,ఉష్ణ ,కాంతి కిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసరించటం వల్లనే కణాలు అనూహ్య వేగం తో అన్ని వైపులకు దూసుకు పోతాయి (విశ్వ కిరానా సిద్ధాంతం ),దేశ కాలాల సాపేక్షత మొదలైన వాటిని కణాదుడు స్స్పస్తం గా చెప్పాడు .
ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వస్తువు ఉత్పత్తికి కారణం అవుతుంది ఈ కలయిక రెండు రకాలుగా జరుగుతుంది .అనువుల్లో అంతర్భాగం గా ఉన్న సహజ భౌతిక శక్తి ,బహిర్గాతమైన మానవాతీత శక్తి అన్నాడు కణాదుడు .ప్రపంచ సృష్టికి అణువులే కారణం .అణువులు గుండ్రగా ఉంటాయి .అణువులు ఒకదానినుంచి ఒకటి వేరైనప్పుడు కాని ,కదలిక లేనప్పుడు కాని ఏ పనీ జరుగదు అన్నాడు .అగోచర శక్తి వల్ల అణువులు కలిసి కణాలుగా మారి ప్రపంచ సృష్టికి కారణ మౌతాయి .కణాలు ఏర్పడటానికి అందులోని అణువులే కారణం .అణువులు ఎప్పుడూ చేతనా స్తితి లో ఉంటాయని కణాదుడు ఊహించ లేక పోయాడు .డిమొక్రటిస్ సిద్ధాంతాల కంటే కనాడ సిద్ధాంతాలు భౌతిక వాదాన్ని బాగా బల పరుస్తాయి .
”పరిమిటి గల పదార్ధం అనంత కోటి వస్తువులకు పదార్ధం కాజాలదు”అన్న వైషేశికం మాదిరిగా సాంఖ్యం అన్ని వస్తువులకు మూల పదార్ధం అనువు అనే నిర్ధారించింది .
కణాడునికి ఔలూఖ్య ,కాశ్యప అనే పేర్లున్నాయి క్రీ పూ ఆరవ శతాబ్ది వాడని ఆధునికులు అంగీకరించారు .ఉత్తర ప్రదేశ్ లో అలహా బాద్ జిల్లా పభోస ప్రాంతం లో ప్రభాస లో కణాదుడు జీవించాడు ఆయనది ”పావురం జీవితం ”అన్నారు కొందరు .అంటే రోడ్డు మీద పడి ఉన్న ధాన్యపు గింజలను ఏరుకొని తిని బతికాడని అర్ధం .చిన్న చిన్న రేణువులు అంటే కణా దులు మీద ఆధార పడిజీవించాడు కనుక ”కణాదుడు ”అని పించుకొన్నాడు .ఆయనకు ”కణ ”,కణ భూకర్ ,కణ భక్ష ”పేర్లు కూడా ఉన్నాయి ఈయన సోమ శర్మకు శిష్యుడు .”సూర్య కారణ సంబంధం ”అనే సిద్ధాంతాన్ని మొదటి సారిగా ఆవిష్కరించిన వాడు కనాడుడే .”వైశేషిక సూత్రా ”రచయితా .ఇది పది గ్రందాల సంపుటి .ప్రతి గ్రంధం లో రెండేసి అధ్యాయాలు ,ప్రతి అధ్యాయం లో అనేక సూత్రాలు ఉన్నాయి ప్రతి గ్రంధంలో కనీసం 370సూత్రాలుంటాయి .పరమాణువులతో ప్రపంచం ఏర్పడిందని వాటిని మళ్ళీ విభజించినా ఆ తర్వాత విభజించటం సాధ్యం కాదు అని చెప్పాడు
కణాద సిద్ధాతం ప్రకారం ఈ విశ్వం ఆరు స్తితులలో ఉంది ద్రవ్య ,గుణ ,కర్మ ,సామాన్య ,విశేష ,సమవాయ స్తితులు .పదార్ధాలు తొమ్మిది అస్తిత్వాలను కలిగి ఉంటాయి భూమి జాలం ,అగ్ని ,తేజ ,వాయు ఏఎధర్ ,కాలం ,అంట రిక్షం మనస్సు ,ఆత్మా ..కణాదుడు నిరీశ్వర వాదిడ చని పోయే ముందైన దేవుడిని ప్రార్ధించమని శిష్యులు కోరితే ”పీలవః ”అని అన్నాడట .అంటే ”పరమాణువు ,పరమాణువు ”.అని అర్ధం .ఈయన భావనలో మనస్సు ఆత్మా రెండు ద్రవ్యాలే .ప్రతి ద్రవ్యం అణురూపం లోనే ఉంటుంది .స్పేస్ అండ్ టైంకూడా ద్రవ్యా లేనివని ఐ న్ స్టీన్ కాలాని కంటే ముందే కణాద మహర్షి చెప్పాడు నిరీశ్వర వాదికావటం వల్ల తగినంత ప్రచారం పొందలేక పోయాడు .
—ఖగోళాన్ని భూగోళానికి దింపిన అలనాటి శిల్ప శాస్త్రజ్ఞులు




ఒరిస్సా ముఖ్య పట్టణం భువనేశ్వర్ కు ‘’ఆలయాల నగరం ‘’అని పేరు .అక్కడి దేవాలయాలను అంతరిక్ష నక్షత్ర మండలాలకు ప్రతీకలుగా నిర్మించటం విశేషం .నక్షత్ర సీమల మధ్య ఉండే దూరాలు వాటి మధ్య అనుబంధాలే మన ప్రాచీన ఆలయ నిర్మాణాలు .ఇవి చూసి ఈ నాటి శాస్త్ర వేత్తలు అలనాటి మన వాళ్ళ వైదుష్యానికి ముక్కున వేలేసుకొంటున్నారు .
.పరాసు రామ దేవాలయం శిఖరం
భువనేశ్వర్ లోని ప్రాచీన ‘’పరశురామాలయం ‘’నిర్మాణం పై దీపక్ భట్టా చార్య 2010లో పరిశోధన చేసి ఎన్నో విషయాలను లోకానికి చాటి చెప్పాడు .ఈ ఆలయ నిర్మాణం మామూలు నిర్మాణ శైలి లో కాకుండా భిన్నం గా ఉందని ముందు గుర్తించాడు .దీనికీ ఖగోళ సంబంధం ఉందని భావించాడు .అతరిక్షం లో నక్షత్రాలు వేర్వేరు దూరాలలో పరచుకొని ఉన్న రీతిలో ఆలయం లోని కొన్ని ముఖ్యమైన కళా రూపాలు కూడా భిన్న భిన్న కోణాలలో ,దిశలలో అమరి ఉండటం చూసి పరమాశ్చర్య పడ్డాడు .తనకున్న పరిజ్ఞానం చాలక ,మరింత లోతుగా అధ్యయనం చేయటం ప్రారంభించాడు .ఈయనకు ప్రహ్లాద చంద్ర నాయక సహకరించాడు .అంతరిక్ష గణితం లో దిట్ట అయిన ప్రహ్లాద కూడా ఏంతో జిజ్ఞాసతో కృషి చేశాడు .చివరికి అంతరిక్షం లో ‘’తారకల అమరిక’’ నే భువనేశ్వర్ లోని ఆలయ నిర్మాణాలలో కూడా ఏర్పరచారని ఇద్దరు తేల్చారు .
భువనేశ్వర్ పాత బస్తీ లో ‘’ఏకామ్ర క్షేత్రం ‘’పరిధిలో సముద్ర మట్టానికి భిన్న మైన ఎత్తు లో ఉండే మూడు ప్రదేశాలున్నాయి .ఒక్కో ప్రదేశం లో తొమ్మిది చొప్పున ఇరవై ఏడు ప్రాచీన నిర్మాణాలున్నాయి .ఇవి నక్షత్రాలకు ప్రాతి నిధ్యం వాహించేవే అని వీరిద్దరి పరి శోధన లో తేలింది .ప్రకాశ వంతమైన నక్షత్రాలను ఒక జాబితా గా రూపొందించే ‘’అంతర్జాతీయ ఏల్ కేటలాగ్ ‘’లో ఉన్న 27నక్షత్రాలకు ,ఈ ప్రాచీన ఆలయ నిర్మాణాలు ప్రాతి నిధ్యం వహిస్తున్నాయని ఎత్తూ ,దూరాల విషయం లో వాటి పరస్పర సంబంధాలు కూడా ఇక్కడా ప్రతి బిమ్బిస్తున్నాయని నిర్ధారించారు .గణిత శాస్త్రానికి సంబంధించిన ఈ నిర్ధారణ కు ‘’కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్’’ (క్యాడ్ )సాఫ్ట్ వేర్ ను వినియోగించుకొన్నారు .
అంతరిక్షం లో ఉన్న నక్షత్ర మండలాలకు ,భూమి మీద ఉన్న ఈ నిర్మాణాలకు ఉన్న సంబంధాన్ని తులనాత్మకం గా అధ్యయనం చేసిన తర్వాత మన ప్రాచీనులు తారా మండలాన్ని దృష్టిలో ఉంచుకొనే ఎంపిక చేసిన ప్రత్యెక ప్రదేశాలలో ఈ నిర్మాణాలు చేశారని స్పష్టం చేశారు .భువనేశ్వర్ లో ‘’బారంగ ఘడ్ ,శిశుపాల్ ఘడ్ మొదలైన శివారు ప్రాంతాల్లో చతురస్రాకా రాలలో ఉన్న కోటలను అంత రిక్షం లోని ‘’పిగాసన్ స్క్వేర్ ,క్రేటర్ నక్షత్ర మండలాలకు ప్రతి నిధులుగా నిర్ణయించారు .అలాగే రెండు త్రిభుజా కారాల్లో రూపొందించి నట్లు కనీ పించే ‘’సెటస్’’నక్షత్ర మండలం ‘’ఖంద గిరి,ఉదయ గిరి ప్రాంతాలను ,’’వేలా ‘’నక్షత్ర మండలం భువనేశ్వర్ తూర్పు తీరం లోని ఓడ రేవునూ సూచిన్చేట్లు ఉండటం విశేషమైన విషయం .
భట్టా చార్య ,ప్రహ్లాదలు 2000 మే నెలలో ఒక సదస్సు జరిపి తమ పరిశోధనలు ఊహా గానాలు కావని సభా ముఖం గా బహిర్గతం చేశారు
. వీరి ఖగోళ గణితం ప్రకారం విడి విడిగాను,సంయుక్తం గాను కనీ పించే 33 నక్షత్రాలకు కేంద్రం గా భావించే ‘’బేబెల్ గూస్ ‘’ అంత రిక్ష స్థానం ,వీరి ఖగోళ గణితం ప్రకారం భువనేశ్వర్ లోని ‘’పరశు రామాలయం ‘’ప్రాంతాన్నే సూచిస్తోంది .ప్రకాశ వంతమైన ఎరుపు రంగు లో ఉండే ‘’బెటల్ గూస్ ‘’నక్షత్రాన్ని ఋగ్వేదం తెలియ జేస్తోంది .పరశురామేశ్వరం లో శివ లింగం మామూలుకు భిన్నంగా ప్రకాశ వంతమైన ఎరుపు రంగులో ఉండటం ఇక్కడి విశేషం .దీన్ని కేంద్రం గా తీసుకొని ఊహా రేఖలను గీస్తే అంతరిక్షాన్ని60 డిగ్రీల కోణం లో ఆక్రమిస్తూ ఏర్పడే మహా నక్షత్రం ‘’తారక ‘’ఆకారం కూడా ‘’ఏకామ్ర క్షేత్ర ఆలయ ‘’లక్షణాలతో సరిగ్గా సరి పోవటం మరీ విశేషం .’’ఆరియస్ ,కాసియోపియా ,హైడ్రా ‘’‘’మొదలైన అనేక నక్షత్రాల జాడలను కూడా ఈ ప్రాచీన ఆలయ నిర్మాణాలలో ప్రతి బిమ్బింప జేసిన ఘనత, మేధా శక్తి మన ఆలయ స్తపతులకు ఉండటం ఏంతో ఆశ్చర్య జనక విషయం .అందుకే ఖగోళాన్ని భూగోళం పై దింపారు అలనాటి మన శిల్ప స్రష్టలు అని ముందే చెప్పాను
.
ఇక్కడ ఇంకో ఆశ్చర్య కరమైన విషయం కూడా ఉంది .నక్షత్రాల ప్రాతి నిధ్యం వహించే ఈ భువనేశ్వర్లయాల నిర్మాణం లో ఆలయాల అభి వృద్ధికి ,పతనానికి కూడా ఆయా నక్షత్రాల గమనంతో సంబంధం ఉందని పరిశోధకులు చెప్పారు .’’సిగ్నస్’’నక్షత్ర మండలం ను ఒరియా భాషలో ‘’చాయా లేక అగ్ని ‘’అని అంటారు .అది తన ప్రదేశాన్ని మార్చుకోన్నప్పుడు భూమి మీద అది ప్రాతి నిధ్యం వహించే నిర్మాణాలు ,ఆలయాలు శిధిలం గా మారటాన్ని ఇందుకు రుజువుగా సూచించారు .పూరీ భువనేశ్వర్ ‘’ప్రాచీ లోయ ‘’లోని ‘’కోణార్క్ ‘’లలో ఉన్న ఈ నాడు కనీ పించే శిధిలాలు ఇవే .
భువనేశ్వర్ లో అతి భారీ స్తాయి ఆలయం ‘’లింగ రాజు ‘’ఆలయం పై భాగం మామూలు ఆలయాలకు భిన్నం గా ‘’పినాక ధనువు ‘’పేరుతొ ఒక విల్లు ఆకారం లో ఉండటం విశేషం .శాస్త్ర వేత్తల లెక్క ప్రకారం ఇది ‘’రేజేల్ ‘’నక్షత్ర మండలానికి ప్రతీక .ఆ నక్షత్ర మండలం ధనుస్సు ఆకారం లోనే ఉంటుంది .ఈ విధం గానే ఈ ఆలయ శిఖరం కూడా అలా ఉండేట్లు నిర్మించారన్న మాటకనుక మన ప్రాచీనుల శాస్త్ర అవగాహనయెంత విశాలమైనదో, లోతైనదో అర్ధం అవుతోంది .ఖగోళ శాస్త్రమే కాదు వైద్య శాస్త్రం లోను ఇప్పుడు ఆలయ నిర్మాణ శాస్త్రం లోను మన వారి ప్రతిభ అంతరిక్షాన్ని ముట్టిందని అర్ధమవుతోంది కదా .






ధన్వంతరి ఆచార్య



ఆయుర్వేద పితామహుడని కీర్తి పొందిన వాడు ఆచార్య ధన్వనతరి .జబ్బు ఎలా చేస్తుంది ,దాని నివారణ ఏమిటి ,ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి మొదలైన విషయాలను గురించి సవివరం గా తెలియ జేసిన వాడు ఈ మహనీయుడు .ఆరోగ్యాన్నిచ్చి ఆయుస్సును పెంచేదే ఆయుర్వేదం అని దానికొక వేదం గౌరవాన్ని కల్గించాడు సుమారు రెండు వందల యాభై వన మూలికలను ,ఖనిజాలను ఔషధాలుగా ఉపయోగించి వైద్యానికి మహోన్నత స్తానం కల్పించాడు ఎప్పటి వాడో ఖచ్చితం గా చెప్పలేము .కాని క్రీ శ .అయిదవ శతాబ్దికి చెందిన ఆచార్య వాగ్భటుడు ధన్వంతరిని ‘’ఆయుర్వేద పితామహుడు ‘’అని కీర్తించాడు .కాశీ రాజు దివోదాసుడికి ,ఆచార్య సుశ్రుతుడికి వైద్యాన్ని బోధించాడని ,‘’దివోదాసు ‘’ధన్వంతరి గా మారాడని చరిత్రకారులు రాశారు .మన ప్రాచీన గ్రందాల వల్ల ధన్వంతరి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దికి చెందిన వాడని తెలుస్తోంది .ప్రపంచ వైద్య చరిత్రకు శ్రీ కారం చుట్టింది మాత్రం ‘’ధన్వంతరి ‘’యే నన్నది సుస్పష్టం .విక్రామాదిత్యుని నవరత్నాలలో ధన్వంతరి పేరు ఉంది ‘అయితే వీరేవ్వరు అసలు ధన్వంతరి కాదు కాశీ రాజు దివోదాసే ధన్వంతరి అని నిర్ధారణ అయింది .ధన్వంతరి సాక్షాత్తు భగ వంతుడే నని మన వారి విశ్వాసం .
సంప్రదాయ ఆయుర్వేదాన్ని మొదటగా సుశ్రుతుడు మొదలైన శిష్యులకు ధన్వంతరి బోధించాడు .మన దేహం పంచ భూత అంశాలతో నిర్మిత మైనదని ,దేహం లోని ఈ మూలకాల మధ్య సమ తౌల్యం కాపాడటమే ఆయుర్వ్యుద్ధికి కీలకం అని ఆయుర్వేదం చెబుతోంది .వ్యాధి లక్షణాలను క్రోడీకరించి వర్ణించి ,ఓషధుల వివరాలను తెల్పి ,మానసిక చింతన ను కూడా జోడించి తనదైన శైలిలో సశాస్త్రీయ సంప్రదాయ వైద్యాన్ని వృద్ధి పరచాడు .ఇదే ‘’ఆయుర్వేదం పేరుతొ చలా మణిఅయింది .ధన్వంతరి ‘’ఆయుర్వేద సృష్టి కర్త’’అయ్యాడు .సూర్యుడికి ఉన్న పదహారు మంది శిష్యులలో ధన్వంతరికూడా ఒకడనిఅంటారు .క్షీర సాగర మధనం లో పుట్టిన వారిలో ధన్వంతరి కూడా ఒకదాని నమ్ముతారు .
ధన్వంతరి రూప కల్పన చేసిన సంప్రదాయ వైద్యం లో ఎనిమిది భాగాలున్నాయి .
1-కాయ చికిత్స –ఇది శరీర భాగాలన్నితికి చేసే సంపూర్ణ చికిత్స .కడుపు లోకి తీసుకొనేవాటిగురించి తెలియ జేస్తుంది .
2-బాల చికిత్స –శిశు రోగాలకు సంబంధించిన అనేక విషయాలు ,చికిత్సా విధానాలు తెలియ జేస్తుంది .బాలారిస్టాలకు సున్నిత చికిత్స ఇందులో ఉంది .
3—గ్రహ చికిత్స –మానసిక వైద్యానికి సంబంధించిన అనేక విషయాలను చర్చిస్తుంది .మనో విశ్లేషణ చేసి మనస్తత్వాలను బేరీజు వేసి చికిత్స చేసే విధానం వివరించారు .
4-శల్యాక తంత్ర –శరీరం లో వివిధ భాగాలకు సంబంధించిన రోగాలను గురించి చెబుతుంది కన్ను ముక్కు చెవి మొదలైన వాటి రోగాలలు నివారణ తెలియ జేస్తుంది .
5—శల్య తంత్ర –చిన్నా ,పెద్ద శాస్త్ర చికిత్సల వివరాలున్నాయి .ఏ సూత్రాలు పాటించాలో వివరాలూ ఉన్నాయి .
6-విష తంత్ర –అశ్వినీ కుమారుడు రాసిన విష శాస్త్రం లోని విషయాలు క్రోడీకరించి ఇందులో చెప్పాడు .ప్రాక్రుతిలో లభించే విషాలు ,అందులో లాభం కలిగించేవి నష్టం కలిగించేవి తెలిపాడు .ఆధునిక ‘’టాక్సీ కాలజి ‘’ఇది ఎంతో ఉపయోగించింది .
7-రసాయన తంత్ర –వన మూలికల తో రూపొందించిన రసాయనాలను ఏ ఏ వ్యాధులకు చికిత్స చేయ వచ్చో చెప్పుతుంది .
8-వాజీ కారణం –నపుంసక లక్షణాన్ని పోగొట్ట టానికి ,పుంసత్వాన్ని పెంపొందించ టానికి చికిత్సా వివరాలున్నాయి .ఇదే ఆధునిక వైద్య శాస్త్రానికి మూలాధారం అయింది
ఇలా ఎనిమిది రకాల విధానం తో సమగ్ర వైద్య శాస్త్రాన్ని రూపొందించాడు ధన్వంతరి ఆచార్య .
నేటి అనాటమీ ,ఎమ్బ్రియాలజి ,ఫిజియాలజీ ,పాదాలజి ,పాదో జేనేసిస్ ,ఫార్మకాలజీ మొదలైన అనేక వైద్య విభాగాలకు బీజం వేసిన వాడు ధన్వంతరి .అంటే ఏదో కేవలం ఆయన్ను వైద్య శాస్త్ర పితామహుడు అని గుడి కట్టి పూజించటం కాదు ఇన్ని విభాగాలలో నిష్ణాతుడు, రూప శిల్పి అని లోకానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మనందరిది .
సుశ్రుతుడు



నూతన మిలీనియం సందర్భం గా 2000 సంవత్సరం లో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర చికిత్స వైద్యుల జాబితాను ఫోటోలతో సహా ప్రచురించింది .అందులో మొదటి పేరు ఆచార్య సుశ్రుతుడిదే .ఆయన పరి శోధనలు ప్రయోగ శాస్త్ర విద్య తోనే ప్రారంభమైంది .
సుశ్రుతుడు క్రీ.శ.ఆరవ శతాబ్దిలో జన్మించి నట్లు తెలుస్తోంది .ఈయన విశ్వామిత్ర మహర్షి కుమారుడని ,అంటారు ధన్వంతరి కి ముఖ్య శిష్యుడు .సుఖ ప్రసవం కోసం శాస్త్ర చికిత్స కూడా చేశాడు .మూత్ర పిండాలలో రాళ్ళను కూడా తొలగించే వాడు .విరిగిన ఎముకలు అతికించటం లో ,కంటి శుక్లాలు తొలగించటం లో కృషి చేశాడు .ప్లాస్టిక్ సర్జరీ ,రైనో ప్లాస్టీ అంటే ముక్కు నిర్మాణం ప్లాస్టిక్ శాస్త్ర చికిత్సలో నిష్ణాతుడు
సుశ్రుతుడు శాస్త్ర చికిత్స మీద ‘’సుశ్రుత సంహిత ‘’ అనే బృహద్ద్ద్ గ్రంధాన్ని రచించాడు .ఇందులో నూటొక్క శాస్త్ర పరికరాలను పేర్కొన్నాడు .ఇది ఇప్పటి శాస్త్ర వైద్యానికి మణి దీపం గా నిలుస్తోంది .ఈయన ప్రక్రుతి ఆరాధకుడు కూడా .జంతు వృక్ష ప్రపంచం మీద ద్రుష్టి సారించి అమూల్య సమాచారాన్ని సేకరించి నిక్షిప్తం చేశాడు .భిన్న ఋతువులలో వాతావరణ పరిస్తితులలో ఆరొగ్యాఆఆఆఆఆమ్ గా ఎలా ఉండాలి అన్న వాటిని వివరించాడు .
ఒక సారి ఒక ప్రయాణీకుడు అడవి గుండా వెడుతుంటే ప్రమాద వశాన అతని ముక్కు తెగింది తెగిన ముక్కును చేత్తో పట్టుకొని దగ్గిరున్న సుశ్రుత ఆశ్రమానికి చేరాడు .ఆయన గమనించి ముందు నీతితో గాయాన్ని తుడిచాడు .దానికి మూలిక్కా రసం అద్దారు సెప్టిక్ కాకుండా .ఒక గిన్నెడు మద్యం తాగించాడు .ఆటను స్పృహ కోల్పోగానే సూక్షమమిన కత్తులతో సూదులతో శాస్త్ర చికిత్స చేశాడు .ఒక ఆకుతో ముక్కు కొలత కొలిచాడు చిన్న పడు నైన వేడి చేసిన కత్తి తో దవడ కంద లో కొంత భాగం కోసి దాన్ని సరిగ్గా కావాలసినంత గా రెండు భాగాలు చేసి ముక్కు పుతాలలో అమర్చాడు .ముక్కు ఆకారాన్ని సరి చేసి బియ్యపు పిండి ,గంధం తో పట్టు వేశాడు .దాని మీద బూరుగు దూది పెట్టి ,ఔషధ నూనె పోసి కట్టు కట్టాడు .రెండు రోజుల్లో ఆ వ్యక్తీ తేరుకొన్నాడు .అతడు ఏ ఏ ఆహార నియమాలు పాటించాలో ఏయే మందులు వాడాలో సూచించాడు సుశ్రుతుడు .
సుశ్రుత సంహిత గ్రంధాన్ని ఎనిమిదో శతాబ్దిలో అరెబిక్ భాష లోకి ‘’కితాబ్ పాశూన్ –ఏ –హింద్ ‘’,కితాబ్ –యి –సుసృద్ ‘’పేరా అనువదించారు .విరిగిన ఎముకలను సరి చేయటానికి అనేక రకాలైన కర్ర బద్దల్ వివరాలున్నాయి ఇదే ‘’శల్య తంత్రం ‘’.మత్తు మందుగా మద్యాన్ని వాడే వాడు
పిస్తులా వ్యాధికి ‘’క్షార సూత్రా ‘’చికిత్స చేసే వాడు మొలలు నాదీ వరణం మొదలైన వాటికీ దీన్ని ఉపయోగించేవారు ఒక దారాన్ని తీసుకొని ఇరవై ఒక్క సార్లుక్షార ఔషధాలతో సమ్మిళితం చేయటాన్నే క్షార చికిత్స అంటారు దీన్ని వాడితే అయిదారు వారాలలో ఫిస్తులా మాయం .
అతి నైపుణ్యం గా శాస్త్ర చికిత్స చేయటానికి కొన్ని జంతువుల వెంట్రుకలను ,బాగా ఎదిగిన వెదురు బొంగులను ,కొన్ని ప్రత్యెక లక్షణాలున్న బెరడులతో చేసిన కుంచెలను ఉపయోగించేవాడు .సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏ మాత్రం వీలున్నా పూర్వ కర్మ చికిత్స అంటే ‘’ఫిజియో తెరపి ‘’చేయాలని సూచించాడు .ఆయన వాడిన శాస్త్ర పరికరాల వివరాలనూ వివరం గా వర్ణించాడు తన గ్రంధం లో సుశ్రుతుడు ,చరకుడు చెప్పిన వైద్య విధానం క్రీస్తు పూర్వమే ఆగ్నేయ ఆసియా ఉత్తర ఆసియా ,మధ్య ప్రాచ్యాలలో బాగా వాడుక గా ఉంది చరిత్ర కారుడు ‘ఫరిస్తా ‘’రాసిన చరిత్రలో పదహారు ప్రాచీన భారత వైద్య శాస్త్ర గ్రంధాలు ఎనిమిదో శతాబ్దం నాటికే అరబ్బులకు పరిచయమైనాయి .
గర్భ ధారణా కు అనువైన ఔషధాలు యవ్వనోత్సాహానికి మందులు సూచించాడు ఆయన తయారు చేసిన ‘’ఫొర్ సేప్స్ ‘’,దిసేక్తింగ్ అండ్ డ్రెస్సింగ్ ఫొర్సేప్స్ ‘’ఈ నాటి శాస్త్ర చికిత్సా సాధనాలకు మార్గ దర్శకలయ్యాయి తెగిన ముక్కు పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేసి అతికించిన మహానుభావుడాయన .
మహా రాష్ట్ర లో పది హేనవ శతాబ్దం లోనే ఇటుకలు తయారు చేసే కాంగ్రా వంశీకులు ప్లాస్టిక్ సర్జరీ లో సిద్ధ హస్తులయ్యారు .ఈ కుటుంబాలలో హకీమ్ దీనా నద కుటుంబం ఇరవై వ శతాబ్దం లో ఈ చికిత్స చేసిన చివరి కుటుంబం .బ్రిటీష్ వాళ్ళు ఈ దేశం లో బాల పడిన తర్వాత ఈ చికిత్సా విధానాన్ని బ్రిటిష్ పాలకులు తెలుసుకొని 1794లో పాశ్చాత్య దేశాలకు తెలియ జేశారు ఇదంతా సుశ్రుత మహర్షి కృషి ఫలితమే .
చరక మహర్షి



మానవ ఆరోగ్యం ఆటను తీసుకొనే ఆహారం మీదనే ఆధార పడుతుందని తెలుసుకొని ”చరక సంహిత ”అనే గ్రంధాన్ని రాసిన వాడు చరక మహర్షి .శారీరక అవసరాలకు కావలసిన శక్తిని ఆహారం ద్వారానే పొందాలని చెప్పాడు .విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి అనుకొనే వారు పన్నెండు రకాల ఆహార వర్గాలను గురించి తెలుసుకోవాలని వాటిని వివరించాడు .గింజలు ,పప్పులు మాంసం ,ఆకుకూరలు ,పండ్లు ,పచ్చని కూరగాయలు ,మద్యం నీళ్ళు ,చెరకు రసం తో తయారైన ఆహారం ,వండిన ఆహారం ,పాల పదార్ధాలు ఇతర తిని బండారాలు గురించేకాక ,అనేక సంప్రదాయ వైద్య చికిత్సలను కూడా తన గ్రంధం లో రాశాడు .
చరకుడు ఏ కాలం వాడో స్పష్టం గా తెలియదు .కాని ఆయన రాసిన సంహిత మాత్రం క్రీ.శ.987లో పర్షియన్ ,అరెబిక్ భాషలలోకి అనువాదమై పోయింది దానిని ”భేళ”అనే ఆయన రాసినట్లు చెబుతారు .చరక మహర్షి క్రీ.శ800వాడు అని అందరి నిర్ధారణ .చరకుడు చెప్పిన వైద్య విషయాలకు మూలం ఋగ్వేదం లో అధర్వ వేదం లో ఉన్నాయి .వాటిని క్రోడీకరించి స్వీయ అనుభవాన్ని జోడించి చికిత్సా విధానం రాశాడు .
చరక సంహిత ఎనిమిది ప్రకరణాలతో నూట ఇరవై అద్యాయాలతో ఉన్న గ్రంధం .సూత్ర స్థాన ,నిదాన స్థాన ,విమాన స్టాన ,శరీర స్థాన ,చికిత్సస్థాన ,కల్పస్థాన ,సిద్ధి స్థాన అనేవే ఎనిమిది ప్రకరణలు .ప్రతి అధ్యాయం లో విపులం గా ఆరోగ్య రక్షణ ,వ్యాధుల చికిత్సలను సూచించాడు .కాలు విరిగితే ఇనుప కాలు అమర్చే విదానం చెప్పాడు .అంధత్వం పక్ష వాటం ,కుష్టు ,మూర్చాస్ ,రాచపుండు అనే కేన్సర్ మొదలైన దీర్ఘ వ్యాధులకు సులభ నివారణోపాయాలు వివా రించాడు .
”జీవేమ శరదశ్శతం ”అన్న వేదం వాక్యాన్ని ఉదాహరిస్తూ నిండు నూరేళ్ళు మానవుడు హాయిగా ఆరోగ్య వంతం గా జీవించాలని కాంక్షిస్తూ ”చరక సంహిత ”రాశాడు .ఆయన పూర్వ నామం ”మహర్షి పునర్వసు ” కాని ఆయన రచించిన గ్రంధం పేరు చరక శాస్త్రమని కొందరు భావిస్తారు ..పునర్వసు మహర్షికి ఒక రోజు ఒక కోరిక కలిగింది. మారు వేషం లో నగరం లో సంచరిస్తూ ”కొ అరుగ్”అంటే ఆరోగ్యం లేని వారెవ్వరూ ?అని ప్రశ్నించటం ప్రారంభించాడట .అప్పుడు ఒకాయన ”చ్యవన ప్రాస ”తిన్నవారేప్పటికి రోగ గ్రస్తులు కారు అని జవాబు చెప్పాడట .ఇంకోడు ”చంద్ర ప్రభావతి ”తింటే రోగాలు రావన్నాడు .వేరొకరు ”వంగ భస్మం ”అన్నారు .కొందరు భాస్కర లవణం అని నిర్మోహ మాటం గా చెప్పారు ..అప్పుడు ఇవన్నీ విన్న పునర్వసుకు ఏడుపొచ్చినంత పని అయింది .తాను ఎంతో కస్టపడి వేదాల నుంచి అనేక విషయాలు సేకరించి వైద్య శాస్త్రం రాస్తే ఎవరూ అర్ధం చేసుకో లేక పోయారని బాధ పడ్డాడు .ఇంతలో ప్రాచీన విద్యా చార్యుడు ”వాగ్భాటుడు ”నదీ స్నానం చేసి వస్తు న్నాడు .మళ్ళీ పునర్వసు అదే ప్రశ్న వేశాడు .అప్పుడు వాగ్భాటు డు ”హిత భుక్తిహ్ మిత భుక్తిహ్ రుత భుక్తిహ్ ”అన్నాడు అప్పుడు పునర్వసు ఆనందం తో తన సంహితను మూడు ముక్కల్లో స్పష్టం గా చెప్పిన వాగ్భాటుడిని ప్రశంసించాడు .
చరకుడు తన వైద్య విధానం లో ”పాదరసం ”ను వాడాడు .ఇది మహా గొప్ప విషయమని వైద్య శాస్త్ర వేత్తలు అంగీకరించారు .శరీరం లో వాత ,పిత్త ,కఫాలు సమ తుల్యం లో లేక పొతే అస్వస్థత చేస్తుందని చెప్పాడు .దాటు లోపం వల్ల ఏ ఏ వ్యాధులు రావచ్చో వివరించాడు .చరక సంహిత ”మహా వైద్య విజ్ఞాన సర్వస్వం ”అంటారు అందరు .దీనిపై విపుల పరిశోధన చేసిన వారు నారదత్త ,చక్ర పాణి ,శివదాస ,వైన దాస ,ఈశ్వర సేన మొదలైన వారు .చరక సంహిత ఆధారం గానే యునానీ వైద్యం ప్రారంభ మయింది .
జన్యు శాస్త్రం లో కూడా చరకుని ప్రవేశం కని పిస్తుంది .లింగ నిర్ధారణ విషయమై అనేక ద్రుష్టి కోణాలను ఊహించి చెప్పాడు .శిశువు మూగ ,గుడ్డి ,చెవిటి గా జన్మిస్తే అది తలి దండ్రుల దోషం కాదని వారి శుక్ల శోనితాలాడే దోషమని చెప్పాడు .ఇవి జన్యు శాస్త్రానికి మూలాలు అయ్యాయి .ఇరవై శతాబ్దాల క్రితమే ఈ విషయాలను తెలియ జేసినా మేధావి చరకుడు .మానవ శరీరం లో మూడు వందలఅరవై ఎముకలున్నాయని నిర్ధారించి చెప్పాడు .గుండెకు సంబంధించిన వ్యాధులను వాటి చికిత్సా విధానాలను కూడా తన గ్రంధం లో చర్చించాడు .ప్రాచీన వైద్య శేఖరుడు ”ఆత్రేయ మహర్షి ”మార్గ దర్శ కత్వం లో అగ్ని వేశుని బోధలు ,రచనలను వృద్ధి చేసిన ఫలితం గా తన సంహిత పరి పుష్టి చెందిందని చరకుడు పేర్కొన్నాడు .సుశ్రుతుడు చరకుడు ,వాగ్భటుతుడు అంద జేసిన మూలికా విశిష్టత ద్వారా పన్నెండు అత్యంత ప్రధాన దేశాలలో భారత దేశం మొదటి స్తానం లో ఉంది .మన దేశ వ్యాప్తం గా ఉన్న మొక్కలలో నలభై శాతం వరకు ఔషధ ప్రయోగాలకు ఉపయోగ పడతాయని ఆధునిక వైద్య శాస్త్ర వేత్తలు అభిప్రాయ పడ్డారు .ఇతర దేశాలలో ఈ సగటు కేవలం పన్నెండు శాతమే .
చరక సంహిత లో ”స్మ్రుతి భ్రంశం ,ధృతి భ్రంశం ,బుద్ధి భ్రంశం ”గూర్చి ప్రస్తావన ఉంది న్యూరోసిస్ ,డిప్రెషన్ ,యాన్గ్సైటీ ,స్కిజోఫీనియా ,ఎపిలేప్సి ,ఉన్మాదం లకు ఏ ఇతర ప్రభావం చూపని గొప్ప వైద్య చికిత్స ను సూచించాడు .సర్ప గ్రంధి ,బ్రాహ్మీ ,జతామూసి ,వచ్చా ,స్వర్ణం ,తగరాలను ఔషధాలుగా వాడే పధ్ధతి తెలిపాడు .తలంటి శిరో వసతి శిరో తాపం ,అంజన కర్మ ,సస్య కర్మ మానసిక వ్యాధులకు గొప్ప చికిత్సలని చెప్పాడు .
చరక సంహిత అనంతర కాలం లో ”ఆయుర్వేద గ్రంధం ”గా రూపు దాల్చింది .ఆరోగ్య వంతుడి లక్షణం ”సమ దోషః సమాగ్నిస్చ ,సమధాతు మల క్రియః -ప్రసంనాత్మే ఇంద్రియ మనః శ్వాసతో ఇత్యభి దీయత్ ”అంటే వాతం పిత్తం కఫం అనే మూడు దోషాలు ,సప్త ధాతువులు ,మల విసర్జన మొదలైన వన్నీ సమ తుల్యం గా ఉండటం తో బాటు ,ఆత్మా ,ఇంద్రియాలు మనస్సు మొదలైనవి ప్రసన్న స్తితిలో ఎవరిలో ఉంటాయో వారే ఆరోగ్య వంతులు .చరక సంహిత లోని మూడు ముక్కలేమితో తెలుసు కొందాం
మొదటిది -హిత భుక్తి -మనం తినే ఆహారం మన శరీరానికి మేలు చేసేదిగా ఉండాలి .తినటానికే జీవించ రాదు .జీ విస్తున్నామ్ కనుక తినాలి .మనం తినే ఆహరం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలకు ఏది ప్రయోజన కరమో దాన్నే తినాలి
రెండోది -మిత భుక్తి -శ్రేష్టమైన తాజా ఆహారాన్నే మితం గా తినాలి .అతిగా తింటే తీపి కూడా చెడు అవుతుంది .సమంజసం గా తృప్తిగా తినాలి .హితమైంది మితం గా తినటం శ్రేష్టం .
మూడోది -రుత భుక్తి -జీవితాన్ని సఫలీకృతం చేసే మంచి ఆహారాన్ని తినాలి .న్యాయం గా సంపాదించినవే తినాలి అప్పుడే శారీరక ఆరోగ్యం తో బాటు మానసిక ఆరోగ్యం కూడా వర్ధిల్లు తుంది
జీవకుడు 


–క్రీ .పూ .అయిదు ఆరు శతాబ్ది వాడు .పాట్నా దగ్గర రాజ గృహ ఆస్థాన వేశ్య శాలా వతికి కుమారుడు .అప్పుడు మగధ సామ్రాజ్య రాజధాని రాజ గృహ .బౌద్ధం ఉన్నత దశలో ఉన్నప్పుడు గొప్ప వైద్యుడుగా ఉన్నాడు. బుద్ధునికి కూడా వైద్యం చేశాడు అరుదైన శస్త్ర చికిత్సలు చేసే వాడు .శిశు వైద్యం లో ప్రవీణుడు’’ కౌమార భ్రుత్య ‘’అనే శిశు రోగ వైద్యం ఈయన ద్వారా వచ్చిందే .
కళ్యాణ –క్రీ శ .1590లో అహి చాత్ర లో పుట్టాడు .తండ్రి మహీం దర . .’’బాల తంత్ర ‘’అనే వైద్య గ్రంధం రాశాడు .పిల్లల వ్యాదులనే ముఖ్యం గా చేసుకొని రాశాడు.గోడ్రాలి కి చికిత్స చేసి సంతాన ప్రాప్తి కల్గించే వాడు సుఖ ప్రసవం, శిశి సంరక్షణ లో ప్రత్యెక శ్రద్ధ తీసుకొన్నాడు .
వర్యో విద–చరకుడు తన సంహిత లో ఈయన గురించి రాశాడు శరీర ఆరోగ్యానికి వాయువు పోషిస్తున్న పాత్ర మీద పరిశోధన చేశాడు .
యత్వి సభ –గణిత శాస్త్రజ్ఞుడు. భూస్వరూప శాస్త్రం లో కృషి చేశాడు
సిద్ధ నిత్యా నాద –పద్నాలుగో శతాబ్ది వాడు .రస రత్నాకరం రాశాడు పర్వత పుత్ర గా ప్రసిద్ధుడు.రస ఔషధాలు తయారు చేశాడు .
సింహ గుప్త –విద్య శాస్త్ర వేత్త .వాగ్భాటుడికి మొదటి కుమారుడు .వ్యాధి నిర్ధారణలో అద్వితీయుడు .
స్పుజ ధ్వజ –ఖగోళ శాస్త్ర వేత్త .బెంగాల్ లో 269లో జననం .దౌత్యవేత్త గా ప్రసిద్ధుడు .’’యవన జాతక సిద్ధాంత ‘’రాశాడు .149లో యవనేశ్వార్ రాసిన గ్రీకు ఖగోళ గ్రంధాన్ని సంస్కృతం లోకి అనువాదం చేశాడు .వైద్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం తయారు చేశాడు .
సురేశ్వర –పదకొండవ శతాబ్ది వాడు .రస వాది .’’శబ్ద ప్రదీప్ ‘’రాశాడు ఇనుము ,బంగారం రాగి ,అభ్రకం మొదలైన వాటి ఉత్పత్తివిదానాలను రాశాడు .’’లోహ సర్వస్వ ,లోహ పధ్ధతి అనే గ్రంధాలు ప్రసిద్ధ మైనాయి .
తోడర్ మల్లు –అక్బర్ మంత్రి .1539జననం .అనేక శాస్త్రాలలో నిష్ణాతుడు .’’తోడార నంద ‘’రాశాడు .అందులో ఆయుర్వేద సౌఖ్యం ఒక విభాగం
త్రిమల్ల భట్టు –పదిహేనవశతాబ్దం లో కాశీ లో జన్మించాడు రోగానిదానశాస్త్రం, ఆహారం ,పద్యం ,చికిత్సా శాస్త్రాలు రాశాడు .ఔషధ నిర్మాణ శాస్త్రం విభజన శాస్త్రం రాశాడు ద్రవ్య గుణ శత శ్లోకి ,వైద్య చంద్రోదయ ,వృత్త మాణిక్య మాల్ ,యుగాంత రంజిని అనే ఈయన గ్రంధాలు దేశ విదేశాలలో ప్రాచుర్యం పొందాయి .
విజయా నంద –ఖగోళ శాస్త్ర వేత్త ..966లో జన్మించాడు .’’కరణ తిలక ‘’సిద్ధాంత గ్రంధం గా రాశాడు .దీన్ని ఆల్ బెరూని అరెబిక్ భాషలోకి అనువాదం చేశాడు .’’ఘావో రాట్అల్ జిజాన్ ‘’అని పేరు పెట్టాడు .
విజయ రక్షిత –పద మూడవ శతాబ్ది వాడు .వైద్య పరిశోధనలో అసామాన్యుడు .’’మాధవి నిదానం ‘’రాశాడు
వృద్ధ జీవక –క్రీ .పూ.ఐదో శతాబ్ది వాడు ‘’వృద్ధ జీవకాయ తంత్ర ‘’రాశాడు వైద్య విజ్ఞానం అంటా ఇందులో ఇమిడ్చాడు .
సోమేశ్వర -1126-38వాడు .కర్నాటక చక్ర వర్తి .అన్ని శాస్త్రాలలో నిధి .’’అభిలశితార్ధ చింతామణి ‘’రాశాడు .లోహాలు వాటి తయారీ వైద్యం లో
వాటి ఉపయోగాలను చర్చించాడు .నిద్ర ,క్రీడలు వినోదం నిత్య జీవితానికి యెంత అవసరమో వివరించాడు .
ఖండ దత్త –గణిత మేధావి మహా రాస్త్రీయుడు .1039వాడు .ఖగోళం లోనూ మేటి .మారాఠీ పాఠ్య గ్రంధాలు రాశాడు .చంద్ర, సూర్య గ్రహణాలు ఎందుకేర్పడతాయో తెలిపాడు ‘’ధ్రువ మానస ‘’గ్రంధం లో గ్రహాల భ్రమణాలు గ్రహణాల మీద గ్రహాల రేఖాంశాలను గణన చేసి105 పద్యాలలో పొందు పరచాడు . ఖగోళం పై ‘’సిద్ధాంత శేఖర ‘’గ్రంధం రచించాడు .
సూత్ర ధారా మండన –భవన నిర్మాణ వేత్త .పదిహేనో శతాబ్ది వాడు .అనేక దేవాలయాలకు రూప శిల్పి ‘’రాజ్య వల్లభ మండన ‘’రాశాడు .