కణాదుడు
కనిపించె సృష్టి అంతా సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుల కలయికతో ఏర్పడినదే అని యిప్పటి ఆధునిక శాస్త్రవేత్తల నుంచి సామాన్య మానవుడి వరకు అందరికీ తెలిసినదే. అయితే ఈ పరమాణు రహస్యాన్ని మొట్టమొదటగా క్రీస్తు పూర్వ కాలంలోనే ప్రపంచానికి చాటి చెప్పిన ప్రాచీన భారతీయ అణు సిద్ధాంత కర్త కణాదుడు. పాశ్చాత్యుడైన్ దెమోక్రటీస్ 2400 సంవత్సరాల క్రితం ఈ పరమాణువునే "ఆటమ్" గా పేర్కొన్నాడు. "ఆటోమస్"(విభజింప వీలుకానిది) అనే గ్రీకు పదం నుండి ఈ ఆటం పుట్టినది. అయితే డెమోక్రటీస్ కు నాలుగు శతాబ్దాలకు ముందే ప్రకృతి లోని ప్రతి పదార్థం సూక్ష్మ కణాల మయం అని ప్రతిపాదించాడు కణాదుడు.
విశ్వంలో అణువు అనేది ఒకతి ఉంటుందన్న భావనను ప్రతిపాదించింది, ఆలోచనలు రేకెత్తించిన తొలి శాస్త్రవేత్త కణాదుడు. "కారణం - ప్రభాఅం " కార్యకారణ సంబంధం వల్లనే సర్వం సంభవమవుతుందని సిద్ధాంతీకరించాడు. ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతమైన {E=mc^2} ప్రతిపాదనకు మూలాలు కణాదుడి సిద్ధాంతమే.
ఈ ప్రపంచం అంతా పరమాణువులతో నిర్మితమైంది. వివిధ శైలీ విన్యాసాలతో పరమాణువులు సమ్మిళితమై సృష్టిలోని సమస్త ఆకారాలు ఏర్పడుతున్నాయి. ప్రకృతిలో కనబడుతున్నా సూర్యుడు . చంద్రుడు , నక్షత్రాలు , సముద్రాలు , పర్వతాలు , అరణ్యాలు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, నుండి మానవుని వరకూల్ చీమ నుండి డైనోసార్ అరకు అన్నీ...అన్నీ అణువుల కలయిక వలనే ఏర్పడుచున్నవి. ఇవన్నీ ఒకదానితో ఒకటి పోలిక లేనివి. విభిన్న ఆకృతులు కలిగినవి. వాటి, వాటి వ్యవహార సరళి కూడ ఒకదానితో ఒకదానికి పోలిక లేని వైవిద్యం కలిగి యున్నాయి. అన్నీ అణువుల సముదాయమే అయినప్పుడు ఈ వైవిద్యం ఎలా సాధ్యపడింది?
కణాదుడు సిద్ధాంతం ప్రకారం "పదార్థమంతా అణువుల సంయోగం చేత సృష్టించబడుతూ ఉంటుంది. ఆయా అణువుల గుణాలు, ధర్మాలు, సంయోగాన్ని అనుసరించి పదార్థం యొక్క భౌతిక రుపం, స్వభావాలు మారుతూ ఉంటాయి. పదార్థాన్ని ఇంకా విభజించడానికి వీల్లేని భాగమే అణువు. అణువులే ప్రపంచానికి మూలాధారం. మూలకారణం. దార్యం లేకుండా కారణం జరగదు "అణువు"కు నాశనం లేదు. అణువులు నాలుగు గుణాలతో నాలుగు రకాలుగా ఉంటాయి. ఒకే గుణం, ఒకేరకంగా ఉండే ఏకథర్మ అణువులు సంయోగం వలననే ఆయా వస్తువుల నిర్మాణం జరుగుతుంది. ఈ కలయిక మళ్ళీ రెండు విధాలుగా ఉంటుంది. 1)అణువుల్లో అంతర్గతంగా ఉండే సహజ భౌతిక శక్తి 2) అణువులకు బహిర్గతంగా ఉండే మానవాతీతశక్తి.
మరింత వివరంగా చెప్పుకోవాలంటే వివిధ వస్తువుల స్వభావ ధర్మాన్ని బట్టి, ఆయా వస్తువులు తమలోఉన్న కణ సంయోగాన్ని బట్టి రూపం ఏర్పరచుకుంటాయి. ఏక స్వభావం కలిగిన కణాలు అనేకం ఒకదానితో ఒకటి కలిసి వస్తురూపం పొందుతాయి. కణంలో ఉండే స్వభావం వస్తువులలోనూ కనిపిస్తుంది.
ఉదాః అగ్నితత్వం గలిగిన అనేక అగ్నికణాలు(అణువులు) సంయోగం చెంది, సూర్యగోళం యేర్పడింది. అగ్నికణాలలో ఉండే అగ్నితత్వమె భౌతిక వస్తురూపం దాల్చిన సూర్యగోళం నుండి వేడిమిని వెదజల్లుతుంది.
No comments:
Post a Comment