Translate

Friday, 17 July 2015


ఆర్యభట్టు





భారతీయ గణిత శాస్త్ర సాంకేతిక ప్రతిభ గణిత అద్భుతాలు ‘సున్నా ‘ విలువ నిర్దారణ గణితం లో సున్నా లేకుంటే ఏమిటనేది అందరు గ్రహించిన సత్యం . సున్నా ప్రస్థావన వేదాలు , పురాణ ఇతిహాసాలలో మనకు కనిపిస్తుంది . క్రీ . పూ 200 లో పింగళుడు’ఛం అనే ఛంశా శాస్త్రవేత్త మొట్టమొదట ‘సున్నా ‘ గురించి వివరించాడు . ఉపనిషత్తులలో సున్నా ప్రస్తావన మనకు కనిపిస్తుంది ఈశా నోపనిష త్తు లో , శాంతి మంత్రంలో ” పూర్ణ మిదః పూర్ణ మిదం !” అనే ప్రస్తావన ఉంది . ఈ శ్లోకం అర్ధం ‘పూర్ణ స్థితి , శూన్య స్థితి ‘ అనే భారతీయ తత్వమునుండి ఈ ఆలోచనా విధానాన్ని ఆవిష్కరించారు . ఈ శ్లోకాన్ని గణిత పరంగా అన్వయించింది మనవాళ్ళే .
క్రీ . శ 620 లో ‘బ్రహ్మ గుప్తుడు ‘ అనే గణిత శాస్త్రవేత్త “బ్రహ్మ స్పుట సిద్దాంతం ” అనే గ్రంథం లో సున్నాను ఒక సంఖ్యతో భాగించి న ఎడల దాని శేషం అనంతం అని వివరించాడు .
ఇంకా సున్నా ప్రస్తావన క్రీ . శ 400 లో ‘సూర్య ప్రజ్ఞాప్తి ‘ అనే జైన గ్రంథం సున్నాను ప్రస్తావించింది . ‘ఆర్యభట్టియం ‘ అనే గ్రంథం లో అధ్యాయం రెండు , శ్లోకం 10లో ‘ఫై’ విలువను 3. 1416 అని వివరించాడు . వృత్తం యొక్క పరిధి , వ్యాసాల నిష్పత్తి ని’ ఫై ‘అంటారు . ఇదే కాక ఆర్యభట్టు తన గ్రంథం లో త్రిభుజ వైశాల్యం ఎలా కనుగొనాలో వివరించాడు సూత్రికరించాడు . (మరికొన్ని విశేషాలు తరువాతి సంచికలో ) సోర్స్ : భారతీయ ప్రతిభా విశేషాలు.

No comments:

Post a Comment