మహాభారతం అణుయుద్ధమా?
47,23,920 మహాభారత యుద్ధంలో పాల్గొన్నా యుద్ధం ముగిసేసరికి 10 మాత్రమే మిగిలారు. అందులో పాండవుల పక్షం నుంచి పంచపాండవులు (ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు), శ్రీ కేష్ణుడు, సాత్యకి (యుయూధనుడు) కలిపి 7 మంది, కౌరవుల పక్షం నుంచి 3, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. ఇంత భారీ జననష్టం కలగడానికి కారణం మహాభారత యుద్ధంలో అణ్వస్త్రాలు ప్రయోగించడమే అనే వాదన కూడా ఉంది. మహాభారతం మాములు యుద్ధం కాదు అణుయుద్ధం అని అనేకమంది పాశ్చాత చరిత్రకారులు, శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఈ విషయం మీద దాదాపు 100 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇక్కడ కొంత సంధిగ్దత నెలకొంది.
18 రోజుల్లో 47 లక్షల పై చిలుకు జనాభా మరణించడం సామాన్యమైన విషయం కాదు. అది మాములు ఆయుధాలతో సాధ్యమయ్యేదీ కాదు. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఇప్పుడు చెప్పబడుతున్న కురుక్షేత్రం ప్రాంతం కంటే చాలా పెద్దది. ధార్మిక గ్రంధాల్లో రెండు రకాల అస్త్రాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి అస్త్రాలు, రెండు శస్త్రాలు. అస్త్రం అనగా మంత్రించి ప్రయోగించేది, మంత్రించిన గడ్డిపరక కూడా అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. శస్త్రం అనగా అణ్వస్త్రం, మిస్సైల్. బాణాలను లాంచర్స్ గా అర్దం చేసుకోవచ్చు.
18 రోజుల్లో 47 లక్షల పై చిలుకు జనాభా మరణించడం సామాన్యమైన విషయం కాదు. అది మాములు ఆయుధాలతో సాధ్యమయ్యేదీ కాదు. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఇప్పుడు చెప్పబడుతున్న కురుక్షేత్రం ప్రాంతం కంటే చాలా పెద్దది. ధార్మిక గ్రంధాల్లో రెండు రకాల అస్త్రాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి అస్త్రాలు, రెండు శస్త్రాలు. అస్త్రం అనగా మంత్రించి ప్రయోగించేది, మంత్రించిన గడ్డిపరక కూడా అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. శస్త్రం అనగా అణ్వస్త్రం, మిస్సైల్. బాణాలను లాంచర్స్ గా అర్దం చేసుకోవచ్చు.
అర్జునుడి గాండీవం కూడా లాంచరే (launcher) అంటున్నారు పాశ్చాత్య పరిశోధకులు. అట్లాగే అక్షయ బాణ తూణీరాలు అనగా మిస్సైల్స్ అని చెప్తున్నారు. ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్ అనే అస్త్రం (మిస్సైల్) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది.
మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందాడు. అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి. మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.
18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. సామ్రాట్ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు. ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.
అసలు ఆ కాలంలో ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉందా? క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన ‘అటామిక్ డిస్ట్రక్సన్ ఇన్ 3000 బి.సి’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం గ్రహించాలి. అణుబాంబు పితామహుడిగా ప్రపంచం ఓఫెనిహీమర్‌ను గుర్తించింది. ఒకసారి ఓఫెనిహీమర్ ఒక కాలేజీలో ప్రసంగానికి వెళ్ళినప్పుడు అక్కడున్న విద్యార్ధి ' లో జరిగిన అణుబాంబు పరీక్ష మొట్టమొదటిదనీ మీరు భావిస్తున్నార?' అని అడుగుతాడు. అంటే ఆ విద్యార్ధి ఉద్ద్యేశం ఇంతకముందు యు.ఎస్.లో ఎప్పుడైన అణుబాంబు పరీక్ష నిర్వహించారా అని. దానికి సమాధానంగా ఓఫెనిహీమర్ 'అవును, ఆధునిక కాలంలో ఇదే మొదటిదీ అని సమాధానం ఇస్తారు. (అనగా ఆధునిక కాలంలో ఇదే మొదటిది, ఇంతకముందు చాలా పూర్వం అనేకం జరిగాయని ఆయన నమ్మకం). ఓఫెనిహీమర్ హార్వర్డ్‌లో అండర్ గ్రాడుయేషన్ చేసారు. తర్వాత ఒక వ్యక్తి పరిచయం ద్వారా సంస్కృతం నేర్చుకున్నారు. సంస్కృతంలో భగవద్గీతను చదివారు. అటు తర్వాత సనాతనధర్మానికి సంబంధించిన గ్రంధాల మీద ప్రత్యేక ఆసక్తి చూపించి, వాటిని అభ్యసించారు. తరుచూ ఆయన ప్రసంగాల్లో మహాభారతం, భగవద్గీత నుంచి శ్లోకాలు ప్రస్తావించేవారు. శివుడి గురించి, కృష్ణుడి గురించి మాట్లాడేవారు. మొదటి అణుబాంబు పరీక్షా సమయంలో కూడా ఓఫెనిహీమర్ భగవద్గీత నుంచి శ్లోకం గట్టిగా చదివి వినిపించారు. భారతీయులకు అణుబాంబుల గురించి జ్ఞానం వేల ఏళ్ళ క్రితమే తెలుసునని నమ్మినవారిలో ఒకరు ఓఫెనిహీమర్. ఈ విధంగా మహాభారతం అణుయుద్ధం అని చెప్పడానికి అనేకానేక పురావస్తు ఆధారాలతో పాటు అనేకమంది పాశ్చ్యాతుల పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి.
మహాభారతంలోని మౌసుల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రుకలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.
కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్కు చెందిన ప్రొఫెసర్ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు. ఇదికాక, మహాభారత యుద్ధం నాటి అణుబాంబుల రేడియో ధార్మికత ప్రభావం రాజస్థాన్ ప్రాంతంలో ఈనాటికి ఉంది.
hindu shastra vignanam
No comments:
Post a Comment