భరద్వాజ మహర్షి వ్రాసిన ''యంత్ర సర్వస్వం'' ప్రాచీన భారతీయుల వైమానిక విద్యా నైపుణ్యానికి నిదర్శనం.ఈ గ్రంథం బరోడా మహారాజావారి గ్రంథాలయంలో వుంది. దీని ఆధారంగానే బోధానందుని వ్యాఖ్యానంతో ''వైమానిక ప్రకరణం'' వెలువడింది. దాదాపు ఏభైవరకు విమాన గ్రంథాలసూచిక ఈ ప్రకరణంలో లభిస్తుంది. అగస్త్యుని ''శక్తిసూత్రం'', ఈశ్వరుని ''సౌదామినీకళ'', ''భరద్వాజుని 'అంశుతంత్రం'', శాకటాయనుని ''వాయుతత్వ ప్రకరణం'', నారదుని ''వైశ్వానరతంత్రం'', ''ధూమప్రకరణం'', వీటిలో ముఖ్యమైనవి.అన్నింటిలో ''యంత్ర సర్వస్వం'', ఎనిమిది అధ్యాయాలు, వంద కాండలు, ఐదువందల సూత్రాలతో విశిష్టంగా పేర్కొనబడింది.

ఆకాశంలోనేకాక గాలిలోను, నీటిలోను, పక్షితో సమానమైన వేగంతో పయనించే దానిని ''విమా నం'' అంటారని భరద్వా జుడు పేర్కొన్నాడు. 36 రహస్యాలు (సాంకేతిక పరిజ్ఞానం) తెలిసినవాడు విమానాన్ని నడపగలడని అతన్నే ''చోదకుడు'' పైలెట్ అంటారని ఆయన వివరిం చాడు. ఈ ''యంత్ర సర్వస్వం'' ఆధునిక, పాశ్చాత్య వైమానిక విద్యావేత్తల్ని ఆశ్చర్యపరు స్తున్నారని భరద్వాజుడు పేర్కొన్న వైమానిక సాం కేతిక పద్దతుల్లో నాల్గు ముఖ్యమైనవి వున్నయి
1. కృతకరహస్యం : విశ్వకర్మ, మయుడు, మనువు చెప్పిన రీతిలో విమానాలు నిర్మించే పద్ధతిని ఇది వివరిస్తుంది.
2. గూఢ రహస్యం: విమాన ప్రయాణాలకు దోహదం చేసే వాయువులు, వాటి చలనాల గురించి వివరిస్తుంది. ఆ వాయువుల పేర్లివి. వాస, వైయాస, ప్రయాస- ఈ మూడు వాయువుల్ని వశపర్చుకున్నట్లయితే విమానాన్ని ఎవరికీ కనిపించకుండా నడుపవచ్చునట!
3. అపరోక్షరహస్యం : పిడుగులవల్ల జన్మించే ఒక రకం 'విద్యుత్తు' గురించి ఈ ప్రకరణం వివరిస్తుంది.ఈ విద్యుత్తును వశపర్చుకుంటే విమానం ముందుగల వస్తువుల్ని పైలెట్ స్పష్టంగా చూడగలుగుతాడు.
4. సర్పగమన రహస్యం : సౌరశక్తిని ఉపయోగించి విమానాన్ని సర్పగతిలో నడిపే పద్ధతిని ఈ ప్రకరణం వివరిస్తుంది. ఇలా యంత్ర సర్వస్వం ప్రాచీన భారతీయుల విమాన విద్యా ప్రావీణ్యం గురించి వివరిస్తుంది.
అంతేకాక అతి ప్రాచీనమైన ఋగ్వేదం కూడా విమాన విద్యారహస్య సూక్తాలున్నాయి.
ఋగ్వేదం (5- 41-6) చెప్పిన ''ప్రావోవాయుం రధ యుజం కృధ్వం'' అనే సూక్తం వాయు శక్తితో నడిచే వాహ నాలను సూచిస్తుంది. అలాగే సాగర తరం గాలపై సంచరించే వాహనాలు (ఓడలు) గురించి
''సింధోర్ ఊర్శ వధి శ్రితఃకరం విబృత్ పరిస్పృం'' అనే సూక్తం వివరి స్తుంది.
ఋహుడు మూడు చక్రాల వాహనాన్ని ఉపయోగించేవాడని గాలిలోనేకాక సముద్రంలో సంచరించే జలాంత ర్గాములు వాడకంలో వున్నాయని ఋగ్వేదం పేర్కొన్నది. ఆవిరి యంత్రాలను వేదకాలపు దాక్షిణికులు ''అగ్నిరథాలు'' అనేవారు. త్రిపుర విమానం గురించి పురాణాల్లో వివరణ ఉంది.
అలాగే రామాయణంలో పుష్పకవిమానం గురించి భారత, భాగవతాల్లో సౌభకం వంటి విమానాల గురించి విశేష వర్ణనలు ఉన్నాయి.
మొత్తంమీద మన ప్రాచీన వాన్మయంలో విమాన నిర్మాణ విద్య గురించిన విశేషాలు ఎక్కువగానే ఉన్నాయి. నేటి ఏరోనాటిక్స్ నేపథ్యంగా ఈ విశేషాలను విశ్లేషించుకోవాలి.

No comments:
Post a Comment