రసాయనిక ,రస సిద్ధాంతాలకు అలనాటి శాస్త్రజ్ఞుల కృషి
భారతీయ ప్రాచీన రసాయన శాస్త్ర విజ్ఞానం కొన్ని శతాబ్దాల పాటు అజ్ఞాతం లో ఉండి పోయింది .భారత ‘’రసాయనిక పారిశ్రామిక పిత’’అని పేరొంది ,ప్రపంచ రసాయన శాస్త్ర వేత్త అయిన ‘’ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే’’రాసిన ‘’హిందూ కేమిస్త్రి ‘’అనే పుస్తకం లో భారతీయ రసాయనిక శాస్త్ర వేత్త ల గురించి సంక్షిప్తం గా చెప్పారు .దీని వల్లనే మొదటి సారిగా మన రసాయనిక విజ్ఞానం లోకానికి తెలిసింది .ఆ కాలం లో’’ధాతు విజ్ఞానం ,చికిత్సా విజ్ఞానం మేళ వింపు’’ నే’’రసాయనిక శాస్త్రం’’ గా భావించే వారట .సాధారణ రసాయన పదార్ధాలను ముఖ్య రసాలు ,ముఖ్య రసాయన పదార్ధాలను మహా రసాలు ,ఉప రసాలు ,సామాన్య రసాలుగా వాటిగా పేర్కొన్నారు.ఆమ్లాలు క్షారాలు ద్రవాలు సొల్యూషన్స్ ఇవన్నీ వారికి తెలిసినవే .
మన పూర్వ రసాయన శాస్త్ర వేత్తలు వాడిన పారి భాషిక పదాలనే రసాయన శాస్త్రం లో వాడుతున్నారు రే.గారు రాసిన గ్రంధం లో ప్రాచీన రసాయన శాస్త్ర వేత్తల జీవితాలు రచనలు చోటు చేసుకొన్నాయి .నాగార్జునుడు ‘’ఆరోగ్య మంజరి ‘’,’’రస రత్నాకరం ‘’,కష పుట తంత్రం ‘’,యోగ సారం ‘’,యోగాస్టకం మొదలైన గ్రంధాలు రాశాడని గోవిందా చార్యుడు ‘’రసార్ణవం ‘’రాస్తే ,యశోధరుడు ‘’రస ప్రకాస సుధాకరం ‘’,సోమదేవుడు ‘’రసేంద్ర చూడామణి ‘’వాగ్భటుడు ‘’రస రత్న సముచ్చయం ‘’,రామ చంద్రుడు ‘’రసేంద్ర చింతామణి ‘’రాసి నట్లు రే చెప్పారు .పూర్వ రసాయన శాస్త్రజ్ఞులు ప్రయోగాలకోసం వైద్యానికి మాత్రమె ప్రయోగాలూ నిర్వహించే వారని తెలియ జేశారు .ధాన్యాలు ,పండ్లు ,దుంపలు ,కర్రలు పుష్పాలతో మద్యం తయారు చేసే వారు వీటికే ఆసవాలు అనే పేరు .వివిధ రోగాలకు వీటిని ఔషధం గా వాడే వారట .మొత్తం తొమ్మిది రకాల ఆసవాలున్నట్లు ఆయన చెప్పారు .సుగంధ ద్రవ్యాలు ,అత్తర్లు గంధాలు ‘’రస శాల ‘’అనే ప్రయోగ శాలలో తయారు చేసేవారు. శాస్త్ర విజ్ఞానాన్ని గురు ముఖతా విని స్వంతం గా ప్రయోగాలు చేసి సిద్ధాంతాలను రూపొందించే వారట .వీరి ధాతు విజ్ఞానం ,చికిత్సా విధానం వైద్య శాస్త్రం లో ఈ రూపం గా ప్రవేశింది .
ఆనాటి రసాయన శాస్త్ర వేత్తలు
-ధుండు నాధుడు –పద్నాలుగో శతాబ్దానికి చెందిన వాడు .కాల నాద మహర్షి శిష్యుడు .’’రసేంద్ర చింతామణి ‘’రచయిత .ఇందులో ఎనిమిది రస సంస్కార విధానాలు చెప్పాడు దీర్ఘ కాల వ్యాధులకు చికిత్సలు సూచిన్చాడు.వైద్యం రస వాదాల మీద పూర్తీ పట్టు ఉన్న వాడు
బిందు –మహా రాష్ట్ర వాడు ‘’రస పద్ధతి రచయిత .అనేక ఔషధాలు రస సంస్కారాలు ఇందులో ఉన్నాయి .సృజన శీలి .
కుమారుడు మహా దేవా తండ్రి గ్రంధానికి వ్యాఖ్యానం రాశాడు ఇందులో మరాఠీ పదాలే ఎక్కువ .
చక్ర పాణి దత్త -1040లో బెంగాల్ లోని భీర్భం లో పుట్టాడు .సంకల కర్త ,వ్యాఖ్యాన కర్త ,.చరక సంహితను అద్భుత వ్యాఖ్యానం గా ‘’ ఆయు ర్వెద దీపిక ‘’రాశాడు .’’చికిత్స సంగ్రహ ,ద్రవ్య గుణ సంగ్రహ ,భానుమతి ఇతని ఇతర రచనలు .ఔషధ నిఘంటువు ను ‘’ ముక్తా వలి ‘’పేరు తో వెలయింప జేశాడు .ఆ నాటి ప్రసిద్ధ వైద్యుడు ‘’నారద దత్త ‘’శిష్యుడై ఘన కీర్తి పొందాడు .
రస వాద విజ్ఞానులు
ఆనంద భారతి -1503-1600వాడు ‘’ఆనంద సిద్ధ ‘’పేరు తో ప్రాచుర్యం పొందాడు .యతీన్ద్రుడు గా నిలిచి పోయాడు .రస వాదం లో ఎన్నో ప్రయోగాలు చేశాడు .దీని పై ‘’ఆనంద మాల ‘’గ్రంధం రాశాడు .ఎనిమిది రకాల పాత్రల స్వరూపాన్ని చెప్పాడు .పాదరాసాన్ని శద్ధి చేసే విధానం చెప్పాడు .తైలాలు ఘ్రుతాలు ,గుళికలు మొదలైన మందుల తయారీ విధానాలను తెలియ జేశాడు .
గోవిందా చార్య –14-15శతాబ్ది వాడు .గుజ రాత్ లో సురాదిత్య కు కుమారుడు .బోధకుడు గా పసిద్ది .సృజన శీలి .’’రస సార’’ గ్రంధ రచయిత . జరణ ,బంధ మొదలైన రస సిద్ధాంతాలపై ఇందులో చర్చించాడు .రస విద్య మీద వచ్చినగోప్ప సిద్ధాంత గ్రంధం ఇదే .ఈ గ్రంధం అత్యంత ప్రామాణికం గా భావిస్తారు .
రామ చంద్ర -14వ శతాబ్దం వాడు .రస సిద్ధాంతానికి ,ప్రయోగాలకు పేరు పొందాడు .సంస్కృతం లో ‘’చక్ర దత్త ‘’,నమక’’ ‘’రసేంద్ర చింతామణి ‘’రాశాడు .రసాయన పొడులు ,భస్మాల విషయాలన్నీ వివరం గా ఇందులో చెప్పాడు .అనేక రోగాలకు ఖనిజాల నుండి తయారు చేసిన ఔషధాల గురించి రాశాడు
రామ కృష్ణ భట్టు –పదహారవ శతాబ్ది వాడు .ఏప్రాంతం వాడో ఖచ్చితం గా తెలీదు. తండ్రి నీల కంఠ ఔషధ శాస్త్రం లో ప్రఖ్యాతుడు .పాద రస రూప కల్పనలో సిద్ధుడు ‘.’రసేంద్ర కల్ప ద్రుమం ‘’అనే సంస్కృత గ్రంధ రచయిత .ఇది పాదరసానికి చెందిన గొప్ప సిద్ధాంత గ్రంధం గా పేరు తెచ్చుకోంది. పాదరసం తయారీ లో అనేక విధానాలను ఇందులో చర్చించాడు .
రామేశ్వర భట్టు –పద్నాలుగో శతాబ్ది వాడు .పాదరసాన్ని ఉపయోగించి అనేక ఔషధాల తయారీ ని చెప్పాడు. పాదరస శుద్ధి ,దాని గుణాల మీద ‘’రస రాజ్య లక్ష్మి ‘’అనే సిద్ధాంత గ్రంధాన్ని రాశాడు
రుద్ర-క్రీ పూ.వాడని అంటారు.అనేక వైద్య గ్రంధాల లో ఈయన పేరు ప్రస్తావించారు ‘’రు యామచరిత్ర ‘పరాద కల్ప ‘’’ధాతు కల్ప ‘’,హరితల కల్ప ‘’(పసుపు పచ్చని తైలాల తయారీ ),’’అభ్రక కల్ప ‘’(అభ్రకం నుంచి ఔషధాల తయారీ )మొదలైన అరవై కి పైగా వైద్య గ్రంధాలు రాసి మహా కీర్తి వంతుడయ్యాడు .‘’,
No comments:
Post a Comment