Translate

Friday, 17 July 2015

విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహర్షి



భాగవతం లో సాల్వుడు ‘’సౌంభక ‘’అనే విమానం లో ద్వారకా నగరం మీద యుద్ధం చేశాడని ఉంది .గయోపాఖ్యానం లో గయుడు ఆకాశం లో రధం లో వెడుతూ ఉమ్మి వేస్తె అది శ్రీ కృష్ణ్డుడు సూర్యుని కిచ్చే అర్ఘ్యజలం లో పడటం ,అది శ్రీ కృష్ణార్జున యుద్ధం దాకా వెళ్ళటం తెలిసిందే .రామాయణం లో కుబేరుని ‘’పుష్పక విమానాన్ని ‘’రావణుడు లాక్కొని అనుభ వించాడు .దానిలోనే శ్రీ రామాదులు లంక నుంచి అయోధ్యకు చేరారని తెలిసిన విషయమే .వసు రాజు కు ఇంద్రుడు ఒక విమానం ఇచ్చాడు అది ‘’ఎయిర్ కండిషన్డ్ విమానం ‘’..దానిలో సకల సౌకర్యాలు ఉన్నాయి .
వి అంటే పక్షి .గాలిలో పక్షి లాగా ఎగిరేది విమానం అని పిలువ బడింది ..మహా భారత కాలానికే విమాన శాస్త్రం వృద్ధి చెందింది .ఋగ్వేదం లో విమాన యాన ప్రసక్తి ఉంది .మూడు చక్రాలతో ఆకాశం లో విహరించేరదాలున్నట్లు మన పురాణాలలో ఉంది .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’లో విమాన యానం కు సంబంధించిన రచన ఉంది .దీనికి అను బంధం గా ‘’సంస్కార రత్నావలి ‘’,’’శకట యానం ‘’,’’లోహ తంత్ర’’,’’యాన బిందువు ‘’మొదలైన గ్రంధాలు వచ్చాయి .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’ను భూర్జర పత్రాల మీద రచించిన భారద్వాజ మహర్షి వివరాలు అందు బాటు లో లేవు .
వు .
క్రీ.పూ.ఏడవ శతాబ్దిలో భరద్వాజుడు జన్మించినట్లు తెలుస్తోంది .తండ్రి బృహస్పతి .తల్లి మమత .హిమాలయ పర్వత సానువులలో జన్మించినట్లు భావిస్తారు .ఋగ్వేద అధర్వణ వేదం ,రామాయణ ,మహా భారతాలలో భరద్వాజ ప్రసక్తి ఉంది .ఈయనే విమాన శాస్త్ర రచయిత గా అందరు భావిస్తారు .భరద్వాజుడు రాసిన ‘’బృహత్ యంత్ర సంహిత ‘’లో విమాన శాస్త్రం ఒక భాగం మాత్రమె .ఇందులో అనేక పూర్వ గ్రంధాలను ఆధారం చేసుకొని రాసినట్లు చెప్పాడు .ప్రాచీన విజ్ఞాన గ్రంధాలు ముఖ్యమైనవి 25ఉన్నాయి .అవి ‘’వైశ్వానర తంత్రం ,ధూమ ప్రకరణం ,సౌదామిని కళ,శక్తి సూత్రం ,అంశు బోధిని ,వాయు తత్వ ప్రకరణం ,ఆకాశ తత్త్వం.
భరద్వాజుడు రాసిన విమాన శాస్త్రం కు విపులమైన వ్యాఖ్యానం రాసిన వాడు ‘’బోదా నంద’’ .ఆయన రాసిన ప్రకారం భరద్వాజుడు వేదాలను మదించి ,ఈ యంత్ర శాస్త్రాన్ని తయారు చేశాడు .భారద్వాజునికి పూర్వమే కొంతమంది విమాన శాస్త్రం పై అనేక పరిశోధనలు చేశారని,గ్రంధస్తం చేశారని తెలుస్తోంది .అయితే అవి అస్పస్టాలు అసంపూర్నాలు అవటం తో అసలు విషయం తెలియ లేదు .శౌనక మహర్షి రాసిన ‘’వ్యోమ యాన యంత్రం ‘’వాచస్పతి రాసిన ‘’యాన బిందు ‘’,నారాయణ రాసిన ‘’విమాన చంద్రిక ‘’దుండి నాధుడు రాసిన ‘’వ్యోమ యానార్క ప్రకాశిక ‘’,గార్గ్య మహర్షి రాసిన ‘’యంత్ర కల్పం ‘’,చక్రాయన రచించిన ‘’భేత యాన ప్రదీపిక ‘’మొదలైనవి భరద్వాజుని విమాన శాస్త్రానికి ముందువే .
భరద్వాజ విమాన శాస్త్రం లో ఎనిమిది అధ్యాయాలువంద అధికరణాలు,500సూత్రాలున్నాయి ,ఇదీ అసంపూర్తి గ్రంధమే .పూర్తీ గ్రంధం అలభ్యం .భరద్వాజుడు తన విమాన శాస్త్రం లో మొత్తం 32విమాన శాస్త్ర సిద్ధాంతాలు ఉన్నాయని పేర్కొన్నాడు .విమాన నిర్మాణం లో
32యంత్రాలున్నట్లు ,వాటిని ఎక్కడెక్కడ అమర్చాలో వాటి పనులేమిటో కూడా తెలియ జేశాడు .2005లో హరిద్వార్ లో ఆవిష్కరింప బడిన ఆమంచి బాల సుదాకర శాస్త్రిగారి రచన ‘’భరద్వాజ వైమానిక ‘శాస్త్రం ‘’లో కావలసిన వివరాలున్నాయట .శాస్త్రి గారు విజయ వాడలో ‘’మహర్షి కాల జ్ఞానం ‘’సంపాదకులట.ఇందులో మూడు వేల శ్లోకాలు వంద అధ్యాయాలు ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ లలో ఈ పుస్తకం వేలు వడిందట . మన దేశం లో రైట్ సోదరులకు పూర్వమే బొంబాయి లో’’ శివ శంకర్ బాపూజీ తల పడే ‘’అనే శాస్త్ర వేత్త1895లో మొదటి విమానాన్ని తయారు చేసి ఆకాశం లో ఎగిరెట్లు చేశాడట .ఈయన బొంబాయి చైనా బజార్ లో ఉండేవారు .సంస్క్రుత ఆంగ్లలో నిష్ణాతుడు .విజ్ఞాన పరిశోధనల్లో ఆరి తేరిన వాడు .బొంబాయి జే.జే.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో లెక్చరర్ .వేదం వాగ్మయాన్ని అవలోడనం చేసిన వారు .1913లో శివకర్ గారు ‘’ప్రాచీన విమాన విద్వేచా శోధ’’పేరుతొ మరాఠీ లో ఒక గ్రంధం రాశారు .భార్య మిత్రుల సహకారం తో వేదం లోని విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకొని విమానాన్ని నిర్మించారు .తన విమానానికి‘’మరుత్సఖ’’ (వాయు మిత్రుడు ).అని పేరు పెట్టారాయన .బొంబాయి లోని ఆర్ట్ సొసైటీ నిర్వహణ లో ఉన్న టౌన్ హాల్ లో ప్రదర్శించారు .పాదరసాన్ని ,సౌర శక్తిని ఇంధనాలు గా ఉపయోగించారు .బొంబాయి లోని ‘’చౌ పట్టి’’సముద్ర ప్రాంతం లో ప్రయోగించి నడిపించారు .1500అడుగుల ఎత్తు వరకు ‘’మరుత్సఖ ‘’యెగిరి క్షేమం గా భూమి మీదకు దిగింది .ఆ నాటి బరోడా యువరాజు సాయీజీ రావు గైక్వాడ్ ,ప్రసిద్ధ న్యాయ వేత్త మహా దేవా గోవింద రానడే ,వాణిజ్య వేత్త లాల్జీ నారాయణ్ జీ మొదలైన ప్రముఖు లందరూ ఈ విమానాన ప్రయోగాన్ని చూశారు .దీన్ని అభి వృద్ధి చేయటానికి కావలసిన ఆర్ధిక సాయం చేస్తామని వీరందరూ ప్రకటించారు .కొద్దికాలానికే ఆయన ఆరోగ్యం క్షీణించటం భార్య మరణించటం తో ,శివాకర్ గారు కూడా చని పోవటం తో ఈ ప్రయోగం ఆగిపోయింది .ఈయన వారసులు ఈ తోలి విమానాన్ని బ్రిటిష్ కంపెని కి అమ్మేశారు .బాల గంగాధర తిలక్ తన కేసరి పత్రిక లో 1953 may 10న ఒక వ్యాసం రాశారు ‘’శివకర్ తల పడే’’ విమాన ప్రయోగం గురించి పూర్తీ వివరాలు అందులో రాశారు .బ్రిటిష్ ప్రభుత్వం పరువు పోతుందనే భయం తో ఈ విషయాన్ని అంతకు ముందు
బయటికి పొక్క కుండా చేసింది. కాని తిలక్ గారి వల్లనే మొదటి సారి లోకానికి తెలిసింది .1950లో ‘’శిల్ప సంసార ‘’అనే పత్రిక వేదాలలో విమాన శాస్త్ర వివరాలను ధారా వాహిక గా రాచురించింది .1956లో జనవరి ఎనిమిదిన ‘’త్రిపుర ‘’పేరు తో ఒక ప్రత్యెక విమానానికి సంబంధించిన కొన్ని రేఖా చిత్రాలను ప్రచురించారు .ఈ విమానం భూమి మీద ,గాలి లోను ఎగుర గలదని తెలిపింది .
భారద్వాజుడి విమాన శాస్త్ర అధ్యయనాన్నిఅనేక మంది ఆధునిక శాస్త్ర వేత్తలు చేశారు .ఇందులో డాక్టర్ రామ ప్రభు ,డాక్టర్ మహేశ్వర్ సేరోన్ ,డాక్టర్ యెన్ జి దొంగ్రే ,పి రామ చంద్ర రావు మొదలైన వారున్నారు.
1956-60-ల మధ్య రష్యా నుంచి ఉయ్యూరు కు రెండు సార్లు వచ్చిన ఉయ్యూరు వాస్తవ్యూలు రష్యాలో ఆయిల్ శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతా రామయ్య గారు ఇక్కడ జరిగిన పౌర సన్మానం లోను విడిగా బంధువుల ఇంటి లోను మాతో మాట్లాడి నప్పుడు భరద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్రాన్ని జర్మనీ దేశశాస్త్రజ్ఞులు ఇండియా నుంచి తీసుకొని వెళ్లి జర్మని లో విమానాన్ని తయారు చేశారని చెప్పారు .

No comments:

Post a Comment