Translate

Friday, 17 July 2015

ద్వారక... ఓ పరిశీలన



16అక్టోబరు 5561(క్రీస్తుపూర్వం)నాడు మహాభారత యుద్దం కురుక్షేత్రలో ప్రారంభమయింది. 2 నవంబరు 5561నాడు పద్దెనిమిది అక్షౌహిణులు, కౌరవులు సంపూర్ణంగా నశించడంతో ముగిసింది. ఖచ్చితంగా మహాభారత కాలాన్ని నిర్దేశించడానికి చేపట్టిన పరిశోధనలో ఎన్నో సవాళ్ళు.. వీటన్నింటికీ సమాధానంగా భారత మేధావులు మహాభారత కాలరచనని చేశారు. ఈ పరిశోధన శాస్త్రసాంకేతిక రంగాల మేలు కలుయికగా సాగిన పరిశోధనా ఫలం.
ఆధునిక సాంకేతికతతో...
భారతీయుల ఇతిహాసాలు సంస్కృతంలో ఉన్నాయి. కనుక సంస్కృత భాషలో ప్రావీణ్యత సాధించినవారి కృషి మొదటిది. ఆంగ్లభాషలో అనువదించగలిగిన భాషాకోవిదులు రెండవ స్థానం. ఖగోళశాస్త్ర నిపుణత, పురావస్తు పరిశోధనలో ప్రజ్ఞతోపాటు కంప్యూటర్ల వినియోగంపై పట్టు కలిగి ఉండాలి. అంతరిక్షంలోని ఉపగ్రహాలను పనిచేయించడం తెలిసి, దాని సహాయంతో భూగ్రహాన్ని పరిశోధించగల సామర్థ్యం ఉండాలి. ఇవికాక థెర్మోలూమినెసెన్స్ డేటింగ్ విధానం తెలిసి, వివిధ శాస్త్రాలను సమన్వయపర్చగలవారు కూడా కావాలి. ఉదాహరణకి... పురావస్తుశాస్త్రం, ఖగోళశాస్త్రం రెండూ తెలిసినవారు... అలాగే సముద్రగర్భశాస్త్రం, పురావస్తుశాస్త్రం తెలిసి సమన్వయ పర్చ గల రెండుమూడు శాస్త్రాలలో పండితులు కావాలి. ఇవన్నీ ఉంటేగానీ భారతీయ చరిత్ర రచించలేము. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్త ఆర్.ఎస్.అయ్యంగార్ ప్రముఖంగా దీనిలో కృషిచేశారు.
పురాణాలే ఆధారమా?....
ఏదేశ చరిత్ర చూసినా తవ్వకాలు, అందులో దొరికిన అవశేషాలు మాత్రమే ఋజువులుగా ఉంటాయి. కానీ భారతదేశంలో పురాణాలు చరిత్రను పదిలంచేశాయి. లక్ష శ్లోకాలతో వ్యాసభగవానుడు రాసిన మహాభారతం కేవలం నేడు 8,800శ్లోకాలతో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులోని అంశాల ఆధారంగా పరిశోధన సాగింది. గ్రహణాలు పురాణాలలో అనేకచోట్ల వివరించబడ్డాయి. దర్మరాజు పుట్టిన సమయంలోని గ్రహాల స్థానాలు వీటినిబట్టి ప్రస్తుతం నక్షత్ర, గ్రహస్థానాలు ప్రాతిపదికగా చేసుకుని చరిత్రకాల రచనచేశారు. దీనికోసం ఖగోళనక్షత్ర గమనాలు అంచనాలు వేసే సాఫ్ట్ వేర్ ని ఆధారం చేసుకున్నారు. ఈవిధంగా ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఫలానా గ్రహకూటమి, గ్రహణంలో ఏర్పడిందో లెక్కలుకట్టి సశాస్త్రీయంగా నిరూపించారు. పెళ్ళిళ్ళకూ, గర్భాదానాలకు ఉపయోగపడేదే జ్యోతిషం అనుకుంటున్న తరుణంలో తిథి,వార,నక్షత్ర,యోగ, కరణాలు ఉనన పంచాగాల సత్తా తెలిసింది. ఏగ్రహణం ఎప్పుడొస్తుందో తెలియాలంటే కోట్ల కోట్ల రూపాయలు ఖరీదుచేసే కంప్యూటర్లు కావలసిన పాశ్చాత్యులు... వేలకొలదీ ఏళ్ళనుంచి నోటిలెక్కలు కట్టి గ్రహణపట్టు విడుపులు చెప్పగలిగిన ఆర్యభట్టారకులను చూసి ఆశ్చర్య పోతున్నారు. నక్షత్రాలు, గ్రహగతులు, భూపరిభ్రమణం, భమణం నుంచి నిమిషాలు, సెకెండ్లతో సహా లెక్కించే విధానమే జ్యోతిషం. దీనిని ప్రాతిపదికగా చేసుకుని సమయ నిరూపణం చేయడం సశాస్ర్యీయ విజ్ఞానం.
మూడు గ్రహణాలు :
మహాభారతంలో పేర్కొన్న మూడు గ్రహణాలు ముఖ్యమైనవి. మొదటిది... సభాపర్వంలో (79:29) విదురుడు పేర్కొన్న సూర్యగ్రహణం. ఇది పాండవులు అరణ్యవాసం సందర్భంలో సంభవించింది. భీష్మపర్వం(3:29)లో రెండవ సూర్యగ్రహణం ఉంది. దీనికి పక్షం రోజుల ముందు చంద్రగ్రహణం కూడా నమోదు అయింది. ఈ సూర్య,చంద్రగ్రహణాల మధ్య మహాభారతం మొదలైంది. ఇక మూడవది...శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి సమయంలో సంభవించింది. దీనిని మౌసలపర్వం (2:20నుంచి 2:29) వరకు వివరించారు. ఇది అప్పటి ద్వారకలో కనిపించింది. ఆధునిక అధ్యయనాల ప్రకారం చూసినా, ప్రతి ఏభై సంవత్సరాలలో మూడు గ్రహణాలు ఏర్పడడం శాస్త్రీయమే. మొదటి రెండు సూర్యగ్రహణాలు కురుక్షేత్రంలో కనిపించాయి. మూడవ సూర్యగ్రహణం ద్వారకలో కనిపించింది. రెండవ సూర్యగ్రహణం తర్వాత 35ఏళ్ళకు మూడవ సూర్యగ్రహణం సంభవించింది.
సముద్ర గర్భ, పురావస్తు పరిశోధన :
భారత పురావస్తు పరిశోధనా సంస్థ, జాతీయ సముద్రగర్భ శాస్త్ర సంస్థల సంయుక్త పరిశోధన జరపాలని జడ్.డి.అన్సారీ, ఎమ్.ఎస్.మతే ప్రతిపాదించారు. దీనిద్వారా డాక్టర్ రావు ఆధ్వర్యంలో చెప్పుకోదగిన కృషిజరిగింది. సముద్రంలో ఉన్న ద్వారక రహస్యాలు ఈ మహాసాహసికుని పరిశోధనల ఫలమే. ఈయనకు వరల్డ్ షిప్ ట్రస్ట్ అవార్డు అనే అత్యున్నత పురస్కారం కూడా లభించింది. సముద్రగర్భంలో పరిశోధించగలిగిన సాహసికులు, గజ ఈత ఛాయా చిత్రకులు, నిష్ణాతులైన పురావస్తు పరిశోధకులు వీరి బృందంలో ఉన్నారు. వీరు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. వీటిలో ఎకోసౌండర్స్, మడ్-పెనట్రేటర్స్, సబ్ బాటమ్ ప్రొపెల్లర్స్, జలాంతర్గత లోహ అన్వేషిణులు ఉన్నాయి. 1983 నుంచి 1992 వరకు 12 సార్లు సాగరం మధించారు. ఫలితంగా నాటి ద్వారకకు చెందిన వస్తువులు సేకరించి ఫిజికల్ రిసెర్చి లేబొరేటరీకి పంపారు. అక్కడ థెర్మోలూమినెసెన్స్, కార్బన్ డేటింగ్ వంటి అత్యాధునికపరీక్షలు జరిగాయి. వీటివల్ల క్రీస్తుపూర్వం 15నుండి 18వ శతాబ్దాల క్రితం వస్తువులని తేలింది. భారతదేశ చరిత్రలో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక కనుగొనటం ఒక మైలురాయి. దీనివల్ల ద్వారక, శ్రీకృష్ణుడు, మహాభారతాలపై విమర్శకులు చేస్తున్న పుక్కిటి పురాణవిమర్శకు కాలం తీరిపోయిందని డాక్టర్ ఎస్.ఆర్.రావు అన్నారు.
'తీరప్రాంతాన్ని నిత్యం తాకుతూ ఉన్న సముద్రం ఒక్కసారిగా భూమిమీదకు దాడిచేసింది. ఒక్కసారిగా ద్వారకా నగరాన్ని మొత్తం ముంచివేసింది. అతి సుందరమైన మేడలన్నీ ఒక్కొక్కటీ కనుమరుగయ్యాయి. కొద్దిక్షణాలలో నా కళ్ళముందు సముద్ర జలాలు మాత్రమే నిలిచాయి. ఇక మీద ద్వారక ఒక మధుర జ్ఞాపకం మాత్రమే` అని అర్జునుని వర్ణన. దీన్ని పరిశీలిస్తే ఏదైనా సునామీ వచ్చి ద్వారక మునిగిపోయిందేమో అన్న సందేహం పరిశోధకులలో తలెత్తుతంది.
పాండవుల అరణ్యవాసం ప్రారంభం 4 సెప్టెంబరు 5574
అజ్ఞాతవాసం 19మే5562
కీచకవధ 1ఏప్రిల్ 5561
కీచక సోదరుల వధ 2 ఏప్రిల్ 5561
అజ్ఞాతవాస పరిసమాప్తం 9 ఏప్రిల్ 5561
అర్జునుడు అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చింది 16 ఏప్రిల్ 5561
మిగిలిన పాండవులు అజ్ఞాతవాసం వీడింది 19 ఏప్రిల్ 5561
అభిమన్యు ఉత్తరల వివాహం 4 మే 5561
కృష్ణుడు రాయబార నిర్ణయం 27 సెప్టెంబరు 5561
హస్తినలో శ్రీకృష్ణ ప్రవేశం 30 సెప్టెంబరు 5561
కుంతి-కృష్ణుల సమావేశం 1 అక్టోబరు 5561
కౌరవసభకు కృష్ణునికి ఆహ్వానం 2 అక్టోబరు 5561
మొదటిది 3 అక్టోబరు 5561
రెండవ సభలో కృష్ణుని బంధించాలని ప్రయత్నించింది 4 అక్టోబరు 5561
మూడవ సభలో విశ్వరూప సందర్శనం 7 అక్టోబరు 5561
రెండవ సారి కుంతీ దర్శనం 8 అక్టోబరు 5561
కృష్ణ-కర్ణుల సంవాదం, యుద్ధనిర్ణయం, తిరుగుప్రయాణం 9 అక్టోబరు 5561
మహాభారత యుద్ధ ప్రారంభం 16 అక్టోబరు 5561
అభిమన్యుని మరణం 28 అక్టోబరు 5561
యుద్ధం ముగిసింది 2 నవంబరు 5561
ధర్మరాజు పట్టాభిషేకం 16 నవంబరు 5561
భీష్మ నిర్యాణం 22 నవంబరు 5561
పరీక్షిత్తు పుట్టుక 28 జనవరి 5560
అశ్వమేధ యాగం 1 మార్చి 5560
యదుకుల నాశనం 5525
పరీక్షిత్తు మరణం 5499




No comments:

Post a Comment