ధన్వంతరి ఆచార్య
ఆయుర్వేద పితామహుడని కీర్తి పొందిన వాడు ఆచార్య ధన్వనతరి .జబ్బు ఎలా చేస్తుంది ,దాని నివారణ ఏమిటి ,ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి మొదలైన విషయాలను గురించి సవివరం గా తెలియ జేసిన వాడు ఈ మహనీయుడు .ఆరోగ్యాన్నిచ్చి ఆయుస్సును పెంచేదే ఆయుర్వేదం అని దానికొక వేదం గౌరవాన్ని కల్గించాడు సుమారు రెండు వందల యాభై వన మూలికలను ,ఖనిజాలను ఔషధాలుగా ఉపయోగించి వైద్యానికి మహోన్నత స్తానం కల్పించాడు ఎప్పటి వాడో ఖచ్చితం గా చెప్పలేము .కాని క్రీ శ .అయిదవ శతాబ్దికి చెందిన ఆచార్య వాగ్భటుడు ధన్వంతరిని ‘’ఆయుర్వేద పితామహుడు ‘’అని కీర్తించాడు .కాశీ రాజు దివోదాసుడికి ,ఆచార్య సుశ్రుతుడికి వైద్యాన్ని బోధించాడని ,‘’దివోదాసు ‘’ధన్వంతరి గా మారాడని చరిత్రకారులు రాశారు .మన ప్రాచీన గ్రందాల వల్ల ధన్వంతరి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దికి చెందిన వాడని తెలుస్తోంది .ప్రపంచ వైద్య చరిత్రకు శ్రీ కారం చుట్టింది మాత్రం ‘’ధన్వంతరి ‘’యే నన్నది సుస్పష్టం .విక్రామాదిత్యుని నవరత్నాలలో ధన్వంతరి పేరు ఉంది ‘అయితే వీరేవ్వరు అసలు ధన్వంతరి కాదు కాశీ రాజు దివోదాసే ధన్వంతరి అని నిర్ధారణ అయింది .ధన్వంతరి సాక్షాత్తు భగ వంతుడే నని మన వారి విశ్వాసం .
సంప్రదాయ ఆయుర్వేదాన్ని మొదటగా సుశ్రుతుడు మొదలైన శిష్యులకు ధన్వంతరి బోధించాడు .మన దేహం పంచ భూత అంశాలతో నిర్మిత మైనదని ,దేహం లోని ఈ మూలకాల మధ్య సమ తౌల్యం కాపాడటమే ఆయుర్వ్యుద్ధికి కీలకం అని ఆయుర్వేదం చెబుతోంది .వ్యాధి లక్షణాలను క్రోడీకరించి వర్ణించి ,ఓషధుల వివరాలను తెల్పి ,మానసిక చింతన ను కూడా జోడించి తనదైన శైలిలో సశాస్త్రీయ సంప్రదాయ వైద్యాన్ని వృద్ధి పరచాడు .ఇదే ‘’ఆయుర్వేదం పేరుతొ చలా మణిఅయింది .ధన్వంతరి ‘’ఆయుర్వేద సృష్టి కర్త’’అయ్యాడు .సూర్యుడికి ఉన్న పదహారు మంది శిష్యులలో ధన్వంతరికూడా ఒకడనిఅంటారు .క్షీర సాగర మధనం లో పుట్టిన వారిలో ధన్వంతరి కూడా ఒకదాని నమ్ముతారు .
ధన్వంతరి రూప కల్పన చేసిన సంప్రదాయ వైద్యం లో ఎనిమిది భాగాలున్నాయి .

1-కాయ చికిత్స –ఇది శరీర భాగాలన్నితికి చేసే సంపూర్ణ చికిత్స .కడుపు లోకి తీసుకొనేవాటిగురించి తెలియ జేస్తుంది .
2-బాల చికిత్స –శిశు రోగాలకు సంబంధించిన అనేక విషయాలు ,చికిత్సా విధానాలు తెలియ జేస్తుంది .బాలారిస్టాలకు సున్నిత చికిత్స ఇందులో ఉంది .
3—గ్రహ చికిత్స –మానసిక వైద్యానికి సంబంధించిన అనేక విషయాలను చర్చిస్తుంది .మనో విశ్లేషణ చేసి మనస్తత్వాలను బేరీజు వేసి చికిత్స చేసే విధానం వివరించారు .
4-శల్యాక తంత్ర –శరీరం లో వివిధ భాగాలకు సంబంధించిన రోగాలను గురించి చెబుతుంది కన్ను ముక్కు చెవి మొదలైన వాటి రోగాలలు నివారణ తెలియ జేస్తుంది .
5—శల్య తంత్ర –చిన్నా ,పెద్ద శాస్త్ర చికిత్సల వివరాలున్నాయి .ఏ సూత్రాలు పాటించాలో వివరాలూ ఉన్నాయి .
6-విష తంత్ర –అశ్వినీ కుమారుడు రాసిన విష శాస్త్రం లోని విషయాలు క్రోడీకరించి ఇందులో చెప్పాడు .ప్రాక్రుతిలో లభించే విషాలు ,అందులో లాభం కలిగించేవి నష్టం కలిగించేవి తెలిపాడు .ఆధునిక ‘’టాక్సీ కాలజి ‘’ఇది ఎంతో ఉపయోగించింది .
7-రసాయన తంత్ర –వన మూలికల తో రూపొందించిన రసాయనాలను ఏ ఏ వ్యాధులకు చికిత్స చేయ వచ్చో చెప్పుతుంది .
8-వాజీ కారణం –నపుంసక లక్షణాన్ని పోగొట్ట టానికి ,పుంసత్వాన్ని పెంపొందించ టానికి చికిత్సా వివరాలున్నాయి .ఇదే ఆధునిక వైద్య శాస్త్రానికి మూలాధారం అయింది
ఇలా ఎనిమిది రకాల విధానం తో సమగ్ర వైద్య శాస్త్రాన్ని రూపొందించాడు ధన్వంతరి ఆచార్య .
నేటి అనాటమీ ,ఎమ్బ్రియాలజి ,ఫిజియాలజీ ,పాదాలజి ,పాదో జేనేసిస్ ,ఫార్మకాలజీ మొదలైన అనేక వైద్య విభాగాలకు బీజం వేసిన వాడు ధన్వంతరి .అంటే ఏదో కేవలం ఆయన్ను వైద్య శాస్త్ర పితామహుడు అని గుడి కట్టి పూజించటం కాదు ఇన్ని విభాగాలలో నిష్ణాతుడు, రూప శిల్పి అని లోకానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మనందరిది .
No comments:
Post a Comment